Rana – Samantha : ఈవెంట్లో ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకున్న రానా, సమంత.. ‘రానా నాయుడు’ని ప్రస్తావిస్తూ..

సమంత అవార్డు తీసుకున్నాక రానా కౌంటర్లు వేయగా సమంత కూడా తిరిగి కౌంటర్లు వేసింది.

Rana – Samantha : ఈవెంట్లో ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకున్న రానా, సమంత.. ‘రానా నాయుడు’ని ప్రస్తావిస్తూ..

Rana and Samantha Counter each other in IIFA Event

Updated On : November 6, 2024 / 4:53 PM IST

Rana – Samantha : ఇటీవల ఐఫా వేడుకలు అబుదాబిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సమంతకు వుమెన్ ఆఫ్ ది అవార్డు అందించారు. ఈ వేడుకలను రానా, తేజ సజ్జ కలిసి హోస్ట్ చేసారు. అవార్డులు తీసుకున్న వాళ్ళను అక్కడే స్టేజిపై కాసేపు కౌంటర్లు వేసి సరదాగా నవ్వించారు రానా, తేజ. ఈ క్రమంలో సమంత అవార్డు తీసుకున్నాక రానా కౌంటర్లు వేయగా సమంత కూడా తిరిగి కౌంటర్లు వేసింది. వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ చనువుతో ఇద్దరూ మరింత రెచ్చిపోయి పర్సనల్ కౌంటర్లు కూడా వేసుకున్నారు. దీంతో వీటికి సంబంధించిన వీడియోలు, కామెంట్స్ వైరల్ గా మారాయి.

Also Read : Jithendar Reddy : 75 రూపాయలకే సినిమా.. జితేందర్ రెడ్డి బయోపిక్..

రానా సమంతని ఉద్దేశించి.. ఒకప్పుడు మా సిస్టర్ ఇన్ లా నుంచి ఇప్పుడు సిస్టర్ వరకు వెళ్ళింది అన్నాడు. అలాగే నువ్వు ఎందుకు తెలుగు సినిమాలు చెయ్యట్లేదు అని ప్రశ్నించగా సమంత.. నువ్వెందుకు చెయ్యట్లేదు అని రివర్స్ ప్రశ్నించింది. దానికి రానా.. నన్ను ఎవరూ తీసుకోవట్లేదు అని చెప్పగా సమంతా.. నాది కూడా అదే పరిస్థితి. అయినా మనం సినిమా చేస్తే నరసింహ నాయుడులా ఉండాలి కానీ రానా నాయుడు లా కాదు అని కౌంటర్ ఇచ్చింది.

దీనికి రానా కౌంటర్ ఇస్తూ అది సినిమా కాదు సిరీస్. అది నీ ఫ్యామిలీ మ్యాన్ నుంచే చూసి నేర్చుకున్నాను అన్నాడు. ఇలా ఒకరిపై ఒకరు సరదాగా కౌంటర్లు వేసుకున్నారు రానా, సమంత. రానా, వెంకటేష్ కలిసి నటించిన బాలీవుడ్ సిరీస్ రానా నాయుడు వెబ్ సిరీస్ చాలా బోల్డ్ గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక సమంత కూడా ఫ్యామిలీ మ్యాన్ 2 లో బోల్డ్ గా కనపడి అదరగొట్టింది. ఈ రెండిటిని వాళ్ళు ప్రస్తావించడం గమనార్హం.