Nag Ashwin : స్వగ్రామంలోని పాఠశాలకు నాగ్ అశ్విన్‌ ఆర్థిక సాయం..

ప్ర‌భాస్ హీరోగా న‌టించిన మూవీ క‌ల్కి 2898AD.

Nag Ashwin : స్వగ్రామంలోని పాఠశాలకు నాగ్ అశ్విన్‌ ఆర్థిక సాయం..

Director Nag Ashwin fund to Govt school in Nagar Kurnool

Updated On : August 12, 2024 / 5:21 PM IST

Director Nag Ashwin : ప్ర‌భాస్ హీరోగా న‌టించిన మూవీ క‌ల్కి 2898AD. ఈ మూవీతో ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌. థియేట‌ర్ల వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా 1100 కోట్లకు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. హాలీవుడ్ రేంజ్‌లో ఈ మూవీ ఉంద‌ని ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. సైన్స్ ఫిక్షన్ అంశాలు, పౌరాణిక పాత్రలను మిళితం చేసిన విధానానికి అన్ని వర్గాల ప్రేక్ష‌కులు బాగా క‌నెక్ట్ అయ్యాడు.

దర్శకుడిగా అత్యున్నత స్థాయికి చేరుకున్నప్పటికీ.. నాగ్ అశ్విన్ త‌న మూలాల‌ను మ‌రిచిపోలేదు. త‌న సొంతూరిలోని పాఠ‌శాల‌కు భారీ సాయాన్ని చేశాడు. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా ఐతోల్‌ గ్రామంలో తరగతి గదుల నిర్మాణానికి 66 లక్షలు విరాళంగా ఇచ్చారు. పునర్నిర్మించిన పాఠశాల భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాగ్ అశ్విన్ తన తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు.

Kanguva Trailer : ‘కంగువ’లో కార్తీ.. ట్రైలర్‌లో కనిపెట్టేశామంటున్న ఫ్యాన్స్.. మీరూ చూశారా?

రానున్న రోజుల్లో గ్రామంలో దేవాలయం నిర్మించి మరిన్ని ధార్మిక కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. గ్రామాన్ని మార్చేందుకు, గ్రామస్తులకు అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములవుతామని హామీ ఇచ్చారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. నాగ్ అశ్విన్ ప్ర‌స్తుతం కల్కి 2898ADకి సీక్వెల్ తెర‌కెక్కించే ప‌నిలో బిజీగా ఉన్నాడు. రెండో భాగం పై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

NBK 109 : బాలయ్య NBK109 నుంచి సూప‌ర్ అప్‌డేట్‌.. మూవీ టైటిల్ టీజ‌ర్ ఎప్పుడంటే..?