NBK 109 : బాలయ్య NBK109 నుంచి సూపర్ అప్‌డేట్.. మూవీ టైటిల్ టీజర్ ఎప్పుడంటే..?
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వరుసగా మూడు బ్లాక్ బాస్టర్ హిట్లతో నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్‌లో ఉన్నారు.

Director Bobby updates on Balakrishna NBK 109 Title teaser
Balakrishna NBK 109 : అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వరుసగా మూడు బ్లాక్ బాస్టర్ హిట్లతో నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆయన బాబీ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నారు. NBK109 వర్కింగ్ టైటిల్‌తో మూవీ తెరకెక్కుతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఈ మూవీకి సంబంధించిన ఓ సాలిడ్ అప్‌డేట్ డైరెక్టర్ బాబీ ఇచ్చాడు. ఈ చిత్రంలోని ఓ కీలక సీక్వెన్స్‌కి సంబంధించిన షూటింగ్‌ను ఇటీవల జైపూర్‌లో షూట్ చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ సీక్వెన్‌లో బాలకృష్ణ విశ్వరూపం చూపించారన్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్ ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ బాలకృష్ణతో కలిసి ఉన్న ఓ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.
Kanguva Trailer : ‘కంగువ’లో కార్తీ.. ట్రైలర్‌లో కనిపెట్టేశామంటున్న ఫ్యాన్స్.. మీరూ చూశారా?
దీంతో ఈసినిమా టైటిల్ ఎలా ఉంటుందోనని. టీజర్ ఎప్పుడు వస్తుందా అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తుండగా.. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Wrapped up one of the most intense schedules of #NBK109 in Jaipur with the one and only #NandamuriBalakrishna Garu!
His unmatched energy lit up every moment..Get ready to witness the rage of #NBK Garu in these electrifying sequences. ??
TITLE TEASER COMING SOON! ?@thedeol… pic.twitter.com/hVtL4uufM1
— Bobby (@dirbobby) August 12, 2024