Vijay Deverakonda : మొదలైన VD14 సినిమా.. యోధుడిగా విజయ్ దేవరకొండ.. భారీ సెట్ కోసం..

విజయ్ దేవరకొండ తో ట్యాక్సీవాలా సినిమా చేసిన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో గతంలో VD14 సినిమాని ప్రకటించారు.

Director Rahul Sankrityn gives Vijay Deverakonda VD14 Movie Update

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ చివరగా ఫ్యామిలీ స్టార్ సినిమాతో వచ్చి పర్వాలేదనిపించాడు. విజయ్ సాలిడ్ హిట్ కొట్టి చాలా రోజులైంది. ప్రస్తుతం విజయ్ చేతిలో మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. త్వరలో VD12 సినిమాతో రానున్నాడు విజయ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. సమ్మర్ లో రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తుంది. తాజాగా నేడు VD14 సినిమా అప్డేట్ ఇచ్చారు.

విజయ్ దేవరకొండ తో ట్యాక్సీవాలా సినిమా చేసిన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో గతంలో VD14 సినిమాని ప్రకటించారు. ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పుడు ఓ స్పెషల్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో ఓ వీరుడి విగ్రహం ఉండగా శపించబడిన భూమి నుంచి వచ్చిన ఓ యోధుడి కథ, ఇతిహాసాలు రాయలేదు, అవి యోధుల రక్తంలో ఇమిడిపోయాయి అంటూ పవర్ ఫుల్ లైన్స్ తో సినిమాపై ఆసక్తి నెలకొల్పారు.

Also Read : Thalapathy Vijay : విజయ్ లాస్ట్ మూవీ టైటిల్ ఏంటో తెలుసా? ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అదుర్స్‌..

ఇది పీరియాడిక్ యాక్షన్ ఫిలిం అని తెలుస్తుంది. 1854 సంవత్సరం నుంచి 1873 సంవత్సరం మధ్యలో జరిగిన కథగా, విజయ్ దేవరకొండని ఓ యోధుడిగా చూపించబోతున్నారు అని సమాచారం. ఇన్ని రోజులు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ జరగ్గా తాజాగా సెట్ వర్క్ మొదలుపెట్టారు. దీనికి సంబంధించి దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ నేడు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసారు.

Also Read : Balakrishna : పద్మ భూష‌ణ్ పుర‌స్కారంపై తొలిసారి స్పందించిన బాల‌య్య‌..

ఓ ఖాళీ స్థలంలో సెట్ కట్టడానికి పూజ చేసిన పలు ఫోటోలు షేర్ చేసి.. VD14 అప్డేట్.. నేడు పూజతో ఈ సినిమా సెట్ వర్క్ మొదలైంది. 75వ రిపబ్లిక్ డే నాడు వలసవాద చరిత్రపై గొప్ప కథ చెప్పడానికి మొదటి పనిని మొదలుపెట్టాము. ఈ సినిమా ఎవరూ చెప్పని భారతదేశ వలస చరిత్రపై ఇప్పటివరకు తీసిన అత్యంత శక్తివంతమైన సినిమాలలో ఒకటి అవుతుందని నేను అనుకుంటున్నాను అని తెలిపాడు డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్. సినిమా గురించి ఈ రేంజ్ లో హైప్ ఇస్తుండటంతో విజయ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సెట్ వర్క్ అయ్యాక షూటింగ్ మొదలుపెడతారని సమాచారం. మరి విజయ్ యోధుడిగా ఎలా కనిపిస్తాడా చూడాలి.