Thalapathy Vijay : విజయ్ లాస్ట్ మూవీ టైటిల్ ఏంటో తెలుసా? ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అదుర్స్‌..

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ చివ‌రి చిత్రం టైటిల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. అంతేకాదండోయ్.. ఈ చిత్రంలో విజ‌య్ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

Thalapathy Vijay : విజయ్ లాస్ట్ మూవీ టైటిల్ ఏంటో తెలుసా? ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అదుర్స్‌..

Thalapathy Vijay last film title is Jana Nayagan and first look out now

Updated On : January 26, 2025 / 12:59 PM IST

త‌మిళ సూప‌ర్ స్టార్ విజ‌య్ ఇటీవ‌ల రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు సినిమాల‌కు ఇక గుడ్‌బై చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ‘గోట్’ మూవీనే ఆయ‌న‌కు చివ‌రి చిత్రం అని అంతా అనుకున్నారు.

అయితే.. ఆఖ‌రి చిత్రం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఉండ‌బోతుంద‌ని విజ‌య్ తెలిపారు. విజ‌య్ కెరీర్‌లో 69వ సినిమాగా ఇది రూపుదిద్దుకుంటోంది. ఈ క్ర‌మంలో ద‌ళ‌ప‌తి 69 వ‌ర్కింగ్ టైటిల్ పై ఇది తెర‌కెక్కుతోంది.

Balakrishna : పద్మ భూష‌ణ్ పుర‌స్కారంపై తొలిసారి స్పందించిన బాల‌య్య‌..

తాజాగా రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ఈ చిత్ర టైటిల్ తో పాటు విజ‌య్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఈ చిత్రానికి ‘జ‌న నాయ‌గన్’ పేరును పెట్టారు. అంటే ప్ర‌జ‌ల నాయ‌కుడు అని అర్థం. ఇక ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో ప్ర‌జ‌లంద‌రూ జేజేలు కొడుతుండ‌గా విజ‌య్ సెల్ఫీ తీసుకుంటున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. మొత్తానికి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

 

Mass Jatara Glimpse : ర‌వితేజ బ‌ర్త్ డే ట్రీట్‌.. అదిరిపోయిన ‘మాస్ జాత‌ర’ గ్లింప్స్ ..

హెచ్.వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. కె.వి.ఎన్‌ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పూజా హెగ్డే క‌థానాయిక‌. ప్రేమలు ఫేం మమితా బైజు, ప్రకాశ్‌ రాజ్‌, ప్రియమణి, నరేన్‌, గౌతమ్ వాసుదేవ్‌ మీనన్‌, బాబీడియోల్ లు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ ఏడాది అక్టోబ‌ర్ లో ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.