Mass Jatara Glimpse : రవితేజ బర్త్ డే ట్రీట్.. అదిరిపోయిన ‘మాస్ జాతర’ గ్లింప్స్ ..
రవితేజ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న మాస్ జాతర నుంచి గ్లింప్స్‌ను విడుదల చేశారు.

Ravi Teja Mass Jatara Glimpse out now
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తున్నారు మాస్ మహారాజ్ రవితేజ. గతేడాది మిస్టర్ బచ్చన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే.. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ సారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో భాను భాగవరపు దర్శకత్వంలో ‘మాస్ జాతర’ చిత్రంలో నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రవితేజ ఫస్ట్ లుక్‌ను రిలీల్ చేశారు. పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో రవితేజ అదిరిపోయాడు. ఇక నేడు (జనవరి 26) రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.
Padma Awards : సినీ పరిశ్రమలో ఎవరెవరికి పద్మ అవార్డులు వరించాయి తెలుసా? అజిత్, శోభన, బాలయ్య..
వివిధ గెటప్స్‌లో రవితేజ కనిపించాడు. యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా గ్లింప్స్ అదిరిపోయింది. శ్రీలీల కథానాయిక కాగా.. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Nandamuri Balakrishna : బాబాయ్‌కి శుభాకాంక్షలు తెలిపిన జూ. ఎన్టీఆర్
ఈ చిత్రం మే 9 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.