Padma Awards : సినీ పరిశ్రమలో ఎవరెవరికి పద్మ అవార్డులు వరించాయి తెలుసా? అజిత్, శోభన, బాలయ్య..
సినీ పరిశ్రమ నుంచి పద్మ అవార్డులు అందుకోబోతున్నది వీరే..

Film Industry People Who Gets Padma Awards for 2025 List Here
Padma Awards : నేడు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ క్రమంలో పలు సినీ పరిశ్రమ ప్రముఖులకు కూడా పద్మ అవార్డులను ప్రకటించారు.
సినీ పరిశ్రమ నుంచి పద్మ అవార్డులు అందుకోబోతున్నది వీరే..
బీహార్ కి చెందిన ప్రముఖ సింగర్ శారదా సిన్హాకు మరణానంతరం పద్మ విభూషణ్ అవార్డుని ప్రకటించారు. గుజరాత్ కు చెందిన డ్యాన్సర్ కుముదిని రజినీకాంత్ లఖియాకు పద్మ విభూషణ్ ప్రకటించారు.
పద్మ భూషణ్ అవార్డులను తెలుగు సినీ పరిశ్రమకు చెందిన బాలకృష్ణకు, కర్ణాటకకు చెందిన నటుడు, కెజిఎఫ్ ఫేమ్ అనంత్ నాగ్ కు, తమిళనాడు హీరో అజిత్ కు, సీనియర్ నటి శోభనకు, అస్సాం నటుడు జతిన్ గోస్వామికి, మహారాష్ట్ర సింగర్ పంకజ్ ఉదాస్ కు, బాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కపూర్ కు ప్రకటించారు.
Also Read : Balakrishna : బాలకృష్ణకు పద్మ భూషణ్.. దేశంలోనే అత్యున్నత మూడో పురస్కారం..
ఇక పద్మశ్రీ అవార్డులను సింగర్ ఆర్జిత సింగ్, మహారాష్ట్రకు చెందిన నటుడు అశోక్ లక్ష్మణ్ సరఫ్ కు, సింగర్ జస్పిందర్ నరులకు, జార్ఖండ్ కు చెందిన సింగర్, రచయిత మహావీర్ నాయక్, కర్ణాటక మ్యూజిక్ డైరెక్టర్, సింగర్
రిక్కీ బ్యాన్ రాజ్ లకు ప్రకటించారు.