తెలంగాణ నుంచి దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక పద్మవిభూషణ్.. మొత్తం ఏడుగురికి పద్మవిభూషన్, 19 మందికి పద్మభూషణ్
గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర సర్కారు పద్మ పురస్కారాలను ప్రకటించింది.

Dr. D Nageshwar Reddy
గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర సర్కారు పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్ అవార్డు లభించింది. వైద్య విభాగంలో దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి(తెలంగాణ)కి ప్రతిష్ఠాత్మక పద్మవిభూషణ్ పురస్కారం దక్కింది.
ఏపీ నుంచి ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం లభించింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవార్డులు అందుకున్న వారు వీరిద్దరే ఉన్నారు. కాగా, మొత్తం కలిపి 139 పద్మ అవార్డులను ప్రకటించగా, అందులో 113 మంది పద్మశ్రీ అందుకోనున్నారు. తెలుగు రాష్ట్రాలకు మొత్తం 7 పద్మ అవార్డులు దక్కాయి. వాటిలో పద్మ విభూషణ్ 1, పద్మభూషణ్ 1, పద్మశ్రీ 5 ఉన్నాయి.
పద్మ అవార్డుల్లో తెలుగువారు
- పద్మ విభూషణ్ – దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, వైద్యం
- పద్మ భూషణ్ -నందమూరి బాలకృష్ణ, కళారంగం
- పద్మశ్రీ – కేఎల్ కృష్ణ, విద్యా, సాహిత్యం (ఏపీ)
- మాడుగుల నాగఫణి శర్మ, కళా రంగం (ఏపీ)
- మంద కృష్ణ మాదిగ, ప్రజా వ్యవహారాలు (తెలంగాణ)
- మిరియాల అప్పారావు, కళారంగం (ఏపీ)
- వి.రాఘవేంద్రాచార్య పంచముఖి, సాహిత్యం, విద్య (ఏపీ)
Also Read: బాలకృష్ణకు పద్మ భూషణ్.. దేశంలోనే అత్యున్నత మూడో పురస్కారం..
ఏడుగురికి పద్మవిభూషణ్
19 మందికి పద్మభూషణ్