Balakrishna : పద్మ భూషణ్ పురస్కారంపై తొలిసారి స్పందించిన బాలయ్య..
పద్మ భూషణ్ పురస్కారంపై తొలిసారి సినీ నటుడు బాలకృష్ణ స్పందించారు. భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు,

Actor Balakrishna response about Padma Bhushan honour
సినీ రంగానికి చేసిన సేవలకు గానూ సినీయర్ నటుడు నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యున్నత మూడో పురస్కారం అయిన పద్మ భూషణ్ అవార్డు ప్రకటించడం పట్ల బాలకృష్ణ స్పందించారు. కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
“నాకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ ధన్యవాదాలు. నా ఈ సుధీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు, యావత్ చలనచిత్ర రంగానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.” అని బాలయ్య చెప్పారు.
Mass Jatara Glimpse : రవితేజ బర్త్ డే ట్రీట్.. అదిరిపోయిన ‘మాస్ జాతర’ గ్లింప్స్ ..
‘నా తండ్రిగారైన స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుండి ఆయన వారసుడిగా నేటి వరకు నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న నా అభిమానులకు, నాపై తమ విశేష ఆధారాభిమానాలు కురిపిస్తున్న అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటాను.’ అని బాలకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా పద్మ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలియజేశారు.
బాలకృష్ణ.. నటుగానే కాకుండా రాజకీయ నాయకుడిగా, బసవతారకం క్యాన్సర్స్ ఆస్పత్రి ఛైర్మన్ గా ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ (నందమూరి తారకరామారావు) తనయుడిగా చిత్ర పరిశ్రమలో 1974లో తాతమ్మ కల చిత్రంతో అడుగుపెట్టారు. 14 ఏళ్ల వయస్సులోనే తండ్రి ఎన్టీఆర్ తో కలిసి నటించారు. ఇప్పటి వరకు 109 చిత్రాల్లో బాలయ్య నటించారు.
Padma Awards : సినీ పరిశ్రమలో ఎవరెవరికి పద్మ అవార్డులు వరించాయి తెలుసా? అజిత్, శోభన, బాలయ్య..
మాస్, లవ్, కమర్షియల్ చిత్రాలతో పాటు చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇటీవలే ఆయన నటుడిగా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు.