Ram Gopal Varma: మళ్ళీ గిల్లిన వర్మ.. ప్రభాస్ హీరోయిన్స్ చెంప పగలగొట్టారు.. శివాజీపై కౌంటర్

నటుడు శివాజీ చేసిన కామెంట్స్ కి మరోసారి తన స్టయిల్లో కౌంటర్ వేశాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma).

Ram Gopal Varma: మళ్ళీ గిల్లిన వర్మ.. ప్రభాస్ హీరోయిన్స్ చెంప పగలగొట్టారు.. శివాజీపై కౌంటర్

Director Ram Gopal Varma once again given a counter-response to Shivaji.

Updated On : December 29, 2025 / 9:03 AM IST

Ram Gopal Varma: టాలీవుడ్ నటుడు శివాజీ ఇటీవల హీరోయిన్స్ వస్త్రధారణ గురించి చేసిన కామెంట్స్ ఎంత వివాదాస్పదం అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆడవాళ్లు పద్దతిగా డ్రెస్సులు వేసుకుంటేనే వారికి గౌరవం అని, పొట్టి పొట్టి బట్టలు కట్టుకోవడం వల్ల వాళ్ళ గౌరవాన్ని వాళ్ళే తీసుకున్నవారు అవుతారని సూచించాడు. కానీ, మధ్యలో రెండు అసభ్యకరమైన మాటలు వాడటం వల్ల ఆ కామెంట్స్ కాస్త వివాదాస్పదం అయ్యాయి. దీంతో, చాలా మంది సెలబ్రెటీలు శివాజీపై రెచ్చిపోయి కామెంట్స్ చేశారు. ఆడవాళ్ళ డ్రెస్సులు గురించి చెప్పడానికి నువ్వు ఎవరు అంటూ చాలా మంది రెస్పాండ్ అయ్యారు.

Vijay Thalapathy: కిందపడిపోయిన విజయ్.. ఎయిర్ పోర్ట్ లో ఫ్యాన్స్ రచ్చ.. వీడియో వైరల్..

యాంకర్ అనసూయ, సింగర్ చిన్మయి, మంచు లక్ష్మి, మంచు మనోజ్, ప్రకాష్ రాజ్, నాగ బాబు.. ఇలా చాలా మంది శివాజీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ లిస్టులో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) కూడా ఉన్నాడు. ఆయన కూడా అందరిలాగానే శివాజీని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశాడు. ఆడవాళ్లు ఇలానే ఉండాలని చెప్పడానికి నువ్వు ఎవరు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇక, ఈ వివాదంలో శివాజీ మహిళా కమిషన్ ముందు కూడా హాజరయ్యాడు. తప్పుగా మాలాడాను అంటూ క్షమాపణలు చెప్పాడు.

ఈ వివాదం ఇంతటితో ముగిసింది అనుకుంటున్న వేల మరోసారి ఈ ఇష్యూపై కామెంట్స్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. రీసెంట్ గా జరిగిన రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్స్ ధరించిన డ్రెస్సులను ప్రస్తావిస్తూ.. ప్రభాస్ హీరోయిన్స్ శివాజీ అండ్ కో అరుపులు పట్టించుకోకుండా వారికి నచ్చిన డ్రెస్సులో ఈవెంట్ కి వచ్చారు. ఈ ముగ్గురు వాళ్ళ చెంప పగలగొట్టారు”అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ వివాదం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అయినా, ఏ సమస్య లేని చోట కొత్త సమస్య క్రియేట్ చేయడం, దానిని వైరల్ చేయడం వర్మకు అలవాటే కదా. మరి ఈ వివాదం ఇంకా ఎంత వరకు వెళుతుండై అనేది చూడాలి.