Vijay Thalapathy: కిందపడిపోయిన విజయ్.. ఎయిర్ పోర్ట్ లో ఫ్యాన్స్ రచ్చ.. వీడియో వైరల్..

తమిళ స్టార్ హీరో విజయ్(Vijay Thalapathy) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్. దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా. మలయాళ కుట్టి మమిత బైజు కీ రోల్ ప్లే చేస్తోంది.

Vijay Thalapathy: కిందపడిపోయిన విజయ్.. ఎయిర్ పోర్ట్ లో ఫ్యాన్స్ రచ్చ.. వీడియో వైరల్..

Tamil actor Vijay fell down at the airport.

Updated On : December 29, 2025 / 7:48 AM IST

Vijay Thalapathy: తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్. దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా. మలయాళ కుట్టి మమిత బైజు కీ రోల్ ప్లే చేస్తోంది. ఇది విజయ్ కెరీర్ లో చివరి సినిమా కావడంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలోనే తాజాగా జన నాయగన్ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను మలేసియాలో నిర్వహించారు. ఎంతో గ్రాండ్ గా జరిగిన ఈ ఈవెంట్ కి దేశ విదేశాల నుంచి విజయ్ ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు.

Thanuja: బిగ్ బాస్ అయ్యాక అందరూ అలా.. తనూజ మాత్రం ఇలా.. నిజంగా గ్రేట్..

ఇక ఈవెంట్ అంతరం చెన్నై కి తిరిగివస్తున్న సమయంలో ఎయిర్ పోర్ట్ తన ఫ్యాన్స్ తో చాలా సరదాగా మాట్లాడాడు విజయ్(Vijay Thalapathy). అలాగే, ఫ్యాన్స్ తన కోసం తీసుకొచ్చిన చాలా బహుమతులను కూడా స్వయంగా తానే స్వీకరించాడు. అనంతరం వారికి బాయ్ చెప్పేసి చెన్నై బయల్దేరాడు. అయితే, చెన్నైఎయిర్ పోర్ట్ కూడా ఆయన కోసం చాలా మంది ఫ్యాన్స్ అక్కడికి వచ్చారు. దేంతో. కొంతసేపు అక్కడ గందరగోళం ఏర్పడింది. విజయ్ అలా ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా ఫ్యాన్స్ ఆయన మీదకు వచ్చారు. దాంతో, కారు ఎక్కుతుండగా స్లిప్ అయిన విజయ్ కిందపడిపోయాడు. పక్కన సిబ్బంది ఆయన్ని లేపి కారులో ఎక్కించి బయటకు పంపించారు. దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక జన నాయగన్ సినిమా విషయానికి వస్తే, తెలుగులో సూపర్ హిట్ అయిన భగవంత్ కేసరి సినిమాకి ఇది రీమేక్ గా రానుంది అనే కామెంట్స్ వినిపించాయి. కానీ, రీసెంట్ గా జరిగిన ఈవెంట్ లో మాత్రం దర్శకుడు వినోత్ ఇది ఏ సినిమాకు రీమేక్ కాదని చెప్పాడు. అలాగే, విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమాను ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తారంటూ కూడా చెప్పుకొచ్చాడు. మరి 2026 జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.