Manju Warrier : స్టార్ హీరోయిన్‌ని వేధించిన డైరెక్టర్.. అరెస్ట్ చేసిన పోలీసులు..

మలయాళం స్టార్ హీరోయిన్ మంజు వారియర్ 2020లో కయాట్టం అనే సినిమా చేసింది. ఈ సినిమా దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్. ఆ సినిమా అయిపోయిన తర్వాత నుంచి.........

Manju Warrier : స్టార్ హీరోయిన్‌ని వేధించిన డైరెక్టర్.. అరెస్ట్ చేసిన పోలీసులు..

Manju Warrier

Updated On : May 6, 2022 / 9:49 AM IST

Manju Warrier :  మలయాళం స్టార్ హీరోయిన్ మంజు వారియర్ 2020లో కయాట్టం అనే సినిమా చేసింది. ఈ సినిమా దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్. ఆ సినిమా అయిపోయిన తర్వాత నుంచి డైరెక్టర్ సనల్ కుమార్ మంజు వారియర్ ని సోషల్ మీడియాలో, ఫోన్ లో అదే పనిగా మెసేజ్‌లు పంపిస్తూ వేధింపులకు గురిచేశాడు. స్టార్ హీరోయిన్ కావడంతో వార్నింగ్ ఇచ్చి వదిలేసినా, నంబర్ ని బ్లాక్ చేసినా అతను వినకుండా పదే పదే సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేశాడు. దీంతో అతడి వేధింపులు భరించలేక మంజు వారియర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

మంజు వారియర్ మే 4న దర్శకుడు సనల్ కుమార్‌పై తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ కొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మే 5న పోలీసులు తిరువనంతపురంలో ఉన్న సనల్ కుమార్ ఇంటికి మఫ్టీలో వెళ్లి సనల్‌ను అరెస్ట్ చేసి కొచ్చికి తరలించారు. దీంతో ఈ వార్త మలయాళం సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తుంది. మంజు వారియర్ ఫిర్యాదు మేరకు సనల్ కుమార్ ని అరెస్ట్ చేశామని కొచ్చి పోలీసులు తెలిపారు.

NTR : సినిమాకి ఇంకా టైం ఉంది.. అప్పుడే అంత క్లోజా.. ఫ్యామిలీలతో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సెలబ్రేషన్..

ఇటీవలే మలయాళ నటుడు విజయ్ బాబుపై కూడా పలువురు మహిళలు లైంగిక ఆరోపణలు చేసి పోలీసులకి ఫిర్యాదు చేయగా అతను పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.