‘లవ్ స్టొరీ’ లొకేషన్‌లో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల బర్త్ డే సెలబ్రేషన్స్

‘లవ్ స్టొరీ’ లొకేషన్‌లో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల బర్త్ డే.. గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన యూనిట్ సభ్యులు..

  • Published By: sekhar ,Published On : February 5, 2020 / 06:41 AM IST
‘లవ్ స్టొరీ’ లొకేషన్‌లో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల బర్త్ డే సెలబ్రేషన్స్

Updated On : February 5, 2020 / 6:41 AM IST

‘లవ్ స్టొరీ’ లొకేషన్‌లో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల బర్త్ డే.. గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన యూనిట్ సభ్యులు..

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల బర్త్‌డే సెలబ్రేషన్స్ ‘‘లవ్ స్టొరీ” లొకేషన్‌లో యూనిట్ సభ్యుల సమక్షంలో జరిగాయి. యువసామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి, నిర్మాత సునీల్ నారంగ్‌లతో పాటు భరత్ నారంగ్, అభిషేక్ నామా తదితరులు డైరెక్టర్ శేఖర్ కమ్ములకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

‘లవ్ స్టోరి’ తాజా షెడ్యూల్ నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌లో ఉన్న ఈ మ్యూజికల్ ‘లవ్ స్టొరీ’ సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతికి విడుదల చేసిన ‘లవ్ స్టొరీ’ ఫస్ట్ లుక్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. శేఖర్ కమ్ముల, చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ క్రేజ్‌కి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

SK

ఈ ప్రేమకథ సమ్మర్ స్సెషల్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఆర్ట్ : రాజీవ్ నాయర్
సినిమాటోగ్రఫీ : విజయ్ సి కుమార్
మ్యూజిక్ : పవన్
నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు
రచన-దర్శకత్వం : శేఖర్ కమ్ముల