Kushi 2023 : రౌడీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఖుషీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్..

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'ఖుషీ'. సమంత అనారోగ్యం కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. తాజాగా దర్శకుడు శివ నిర్వాణ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు.

Kushi 2023 : రౌడీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఖుషీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్..

director Shiva Nirvana gave an update on Vijay Deverakonda kushi movie

Updated On : March 5, 2023 / 7:09 PM IST

Kushi 2023 : టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఖుషీ’. 2022 ఏప్రిల్ లోనే మొదలైన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ లోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సమంత అనారోగ్యం కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. దీంతో ఈ సినిమా విడుదల తేదీ కూడా పెండింగ్ లో పడింది. అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలు అవుతుందో కూడా మేకర్స్ అప్డేట్ ఇవ్వకపోవడంతో అభిమానులు ఫీల్ అవుతున్నారు. తాజాగా దర్శకుడు శివ నిర్వాణ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు.

Vijay Deverakonda : 100 మందికి జీవితాంతం గుర్తిండిపోయే జ్ఞాపకాలు అందించిన విజయ్ దేవరకొండ..

”త్వరలోనే ఖుషీ షెడ్యూల్ మొదలు కానుంది. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించబోతున్నాము. పీటర్ హేన్స్ ఈ యాక్షన్ సీక్వెన్స్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు” అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం సమంత ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ షూటింగ్ త్వరలోనే పూర్తి కాబోతుండడంతో, ఖుషీ సెట్ లో జాయిన్ అవ్వడానికి సామ్ సిద్దమవుతుందట.

రొమాంటిక్ కామెడీ ఫిలింగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇక లైగర్ ప్లాప్ తో డీలా పడిన రౌడీ అభిమానులు ఒక హిట్టు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. సెన్సిబుల్ లవ్ స్టోరీస్ ని హ్యాండిల్ చేయడంలో దర్శకుడి శివ నిర్వాణకి మంచి అనుభవం ఉంది. దీంతో ఖుషీ వంటి క్లాసికల్ హిట్ మూవీ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా పై టాలీవుడ్ లో మంచి అంచనాలే నెలకొన్నాయి.