Ntr- Shouryuv: ఎన్టీఆర్ మెచ్చిన కథ.. ఇప్పుడు విజయ్ చేస్తున్నాడు.. అబ్బా మంచి ఛాన్స్ మిస్
ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమాను విజయ్ దేవరకొండతో చేస్తున్న దర్శకుడు శౌర్యువ్(Ntr- Shouryuv).
Director Shouryuv is making a film with Vijay Deverakonda, as NTR's dates could not be aligned
- ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేసిన శౌర్యూవ్
- డేట్స్ క్లాష్ అవడం వల్ల విజయ్ తో సెట్ చేసుకున్నాడు
- తరువాత నానితో మరో మూవీ చేస్తున్న శౌర్యూవ్
Ntr- Shouryuv: ‘హాయ్ నాన్న’ వంటి క్లాసిక్ హిట్‌తో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు యంగ్ డైరెక్టర్ శౌర్యూవ్. నాని హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు తాజాగా తన నెక్స్ట్ ప్రాజెక్టును ఫైనల్ చేసుకున్నాడు. విజయ్ దేవరకొండతో తన నెక్స్ట్ సినిమాను అధికారికంగా ప్రకటించాడు. కానీ, దర్శకుడు శౌర్యూవ్ తన నెక్స్ట్ సినిమాను మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో చేయాల్సింది. ఆయన కోసం చాలా కాలం వేచి చూశారు కూడా.
అయితే ఎన్టీఆర్(Ntr- Shouryuv) వరుసగా దేవర, వార్ 2, డ్రాగన్ వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో శౌర్యూవ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తారక్‌తో సినిమా ఆలస్యం కావడంతో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో జతకట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రేజీ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ వైరా ఎంటర్టైన్మెంట్స్ భారీ స్థాయిలో నిర్మించనుంది. శౌర్యూవ్ ముందుగా అనుకున్న కథను విజయ్ దేవరకొండ ఇమేజ్‌కు తగినట్లుగా మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది.
ఇది యాక్షన్, ఎమోషన్స్ కలగలిసిన ఒక కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉండబోతోంది. ‘హాయ్ నాన్న’లో కేవలం ఎమోషన్స్‌తోనే మేజిక్ చేసిన ఈ దర్శకుడు, ఈసారి విజయ్ వంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోతో కొత్త ప్రయోగానికి తెరలేపబోతున్నారు. ఈ ఏడాది ఆఖర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అలా, ఎన్టీఆర్ సినిమా మిస్ అయినప్పటికీ, విజయ్‌తో వస్తున్న ఈ కాంబినేషన్ ట్రేడ్ వర్గాల్లో, అభిమానుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఒక వైవిధ్యమైన స్క్రిప్ట్‌తో రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో సందడి చేస్తుందో వేచి చూడాలి.
