Sreenu Vaitla : డైరెక్టర్ శ్రీనువైట్లకు పితృవియోగం.. సంతాపం తెలుపుతున్న సినీ ప్రముఖులు

శ్రీనువైట్ల స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కందులపాలెంలో నివసిస్తున్న కృష్ణారావు గత కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు........

Sreenu Vaitla : డైరెక్టర్ శ్రీనువైట్లకు పితృవియోగం.. సంతాపం తెలుపుతున్న సినీ ప్రముఖులు

Sreenuvaitla

Updated On : November 28, 2021 / 9:11 AM IST

Sreenu Vaitla :  టాలీవుడ్ లో ఎన్నో సినిమాలతో తనదైన శైలిలో కామెడీతో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల. గతంలో ఎన్నో మంచి విజయాల్ని అందుకున్న శ్రీనువైట్ల ఇటీవల కాలంలో చాలా తక్కువగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా శ్రీను వైట్ల తండ్రి వైట్ల కృష్ణారావు మరణించారు.

Suresh Babu : ఏపీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల థియేటర్స్ కంటే ఓటిటినే సేఫ్ అంటున్న స్టార్ ప్రొడ్యూసర్

శ్రీనువైట్ల స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కందులపాలెంలో నివసిస్తున్న కృష్ణారావు గత కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 83 సంవత్సరాలు. వయోభారంతో, ఆరోగ్య సమస్యలతో ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన వెంటనే శ్రీను వైట్ల తన స్వస్థలానికి బయలుదేరారు.

Akhanda : బాలకృష్ణలాగా డైలాగ్స్ చెప్పేవాళ్ళు ఇండస్ట్రీలో ఎవరూ లేరు: అల్లు అర్జున్

శ్రీనువైట్లకు పితృవియోగం జరిగిన విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు శ్రీనువైట్లకు ఫోన్‌ చేసి సంతాపం తెలుపుతున్నారు.