Sukumar : చాలా కాలమైంది ఇలాంటి కథని చూసి.. బేబీ సినిమాపై సుకుమార్ ప్రశంసల వర్షం..

ఇప్పటికే విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్, రవితేజ, నాగబాబు, రష్మిక, మెహరీన్, రాశిఖన్నా.. లాంటి పలువురు స్టార్స్ బేబీ సినిమాని మెచ్చుకోగా తాజాగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ బేబీ సినిమాపై ప్రశంశల వర్షం కురిపిస్తూ స్పెషల్ పోస్ట్ చేశారు.

Director Sukumar Appreciated Baby movie with special post in social media

Director Sukumar : ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), ప్రధాన పాత్రల్లో SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా బేబీ. జులై 14న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయి భారీ విజయం సాధించింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని కలెక్షన్స్ లో దూసుకుపోతుంది. చిన్న సినిమా అయినా 5 రోజుల్లో ఏకంగా 38 కోట్లు కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

ఇక ఈ సినిమా అందరికి కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా యూత్ కి, లవ్ ఫెయిల్యూర్ వాళ్లకి కనెక్ట్ అవుతుంది. దీంతో చిన్న సినిమా అయినా కూడా చాలామంది థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తున్నారు. ఇక సినిమాలోని సాంగ్స్, కొన్ని సీన్స్ అయితే అదిరిపోయాయి. ప్రేక్షకులు మాత్రమే కాదు స్టార్ సెలబ్రిటీలు కూడా బేబీ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్, రవితేజ, నాగబాబు, రష్మిక, మెహరీన్, రాశిఖన్నా.. లాంటి పలువురు స్టార్స్ బేబీ సినిమాని మెచ్చుకోగా తాజాగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ బేబీ సినిమాపై ప్రశంశల వర్షం కురిపిస్తూ స్పెషల్ పోస్ట్ చేశారు.

Ruhani Sharma : లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘HER’ తో రాబోతున్న రుహాణి శర్మ.. సెన్సార్ పూర్తి.. జూలై 21న రిలీజ్

సుకుమార్ తన పోస్ట్ లో.. చాలా కాలం తర్వాత ఇలాంటి అసాధారణమైన రచనలను చూశాను. కచ్చితంగా ఈ సినిమా సినిమా రచనలలో ఓ కొత్త ఒరవడిని, కొత్త పంథాను తీసుకొస్తుంది. ప్రతి సన్నివేశం నాకు సస్పెన్స్ థ్రిల్లర్‌లా ఉంది. సినిమాలోని పాత్రల తరహాలో పరిస్థితులు ఎక్కడ కనిపించాయో చూడటం ఇదే మొదటిసారి. డైరెక్టర్ సాయి రాజేష్ కు అభినందనలు. ఇలాంటి సినిమాని నమ్మి నిర్మించినందుకు SKN మరియు మారుతీలను అభినందిస్తున్నాను. వైష్ణవి ఇప్పటివరకు రాసిన ఐకానిక్ పాత్రలలో ఒకటి. వైష్ణవి చైతన్య దానిని పూర్తిగా ఆవహించుకొని ఆ క్యారెక్టర్ కి ప్రాణం పోసింది. ఆనంద్ తన పాత్రలో చాలా బాగా నటించాడు. విరాజ్ కూడా బాగా చేశాడు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందమైన దృశ్యంలా ఉంది. బాలరెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా బాగా ప్లస్ అయింది. బేబీ సినిమా గ్రాండ్ సక్సెస్ అయినందుకు టీమ్ మొత్తానికి నా అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. దీంతో సుకుమార్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.