Sukumar – Pushpa 2 : పుష్ప 2 అప్డేట్ ఇచ్చిన సుకుమార్.. అందుకే సినిమా లేట్ అవుతుంది..

సుకుమార్ పుష్ప 2 గురించి మాట్లాడుతూ..

Sukumar – Pushpa 2 : పుష్ప 2 అప్డేట్ ఇచ్చిన సుకుమార్.. అందుకే సినిమా లేట్ అవుతుంది..

Director Sukumar Comments on Allu Arjun Pushpa 2 Movie

Sukumar – Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం అభిమానులతో పాటు దేశమంతా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కానీ ఈ ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సిన పుష్ప 2 ఇంకా షూటింగ్ అవ్వకపోవడంతో డిసెంబర్ 6కి వాయిదా వేశారు. దీంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే పుష్ప 2 నుంచి గ్లింప్స్, సాంగ్స్ వచ్చి అంచనాలు పెంచాయి. తాజాగా సుకుమార్ పుష్ప 2 సినిమా గురించి మాట్లాడాడు.

రావు రమేష్, అంకిత్ కొయ్య, ఇంద్రజ ముఖ్య పాత్రల్లో నటించిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. ఈ సినిమాని సుకుమార్ భార్య తబిత సుకుమార్ రిలీజ్ చేస్తుంది. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుకుమార్, అల్లు అర్జున్ గెస్టులుగా వచ్చారు.

Also Read : Chiranjeevi – Pawan Kalyan : ఆపద్భాందవుడు అన్నయ్య.. ఆయన ఇచ్చిన మద్దతే జనసేనకు విజయం.. పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెస్..

ఈ ఈవెంట్లో సుకుమార్ పుష్ప 2 గురించి మాట్లాడుతూ.. అభిమానులకు మంచి సినిమా అందించడానికి మేము రెస్ట్ తీసుకోకుండా కష్టపడుతున్నాము. కొన్ని సీన్స్ కి ఎక్కువ టైం తీసుకుంటున్నాము, క్వాలిటీ విషయంలో నేను రాజీ పడను. అందుకే పుష్ప 2 లేట్ అవుతుంది. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్, సినిమా రెండూ అద్భుతంగా ఉంటాయి అని అన్నాడు.

ఇక సుకుమార్ భార్య తబిత సుకుమార్ పుష్ప 2 గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం పుష్ప 2 క్లైమాక్స్ షూట్ జరుగుతుంది. బన్నీ, సుకుమార్ ఇద్దరూ బిజీగా ఉన్నా ఈ ఈవెంట్ కి వచ్చారు అని తెలిపింది. అల్లు అర్జున్ పుష్ప 2 గురించి మాట్లాడుతూ.. డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ అయ్యాక అస్సలు తగ్గేదేలే అని అన్నారు.