Sukumar : దర్శకుల సంఘానికి డైరెక్టర్ సుకుమార్ విరాళం.. ఎంతంటే..

ఇప్పటికే డైరెక్టర్ అసోసియేషన్ కి పలువురు సినీ ప్రముఖులు విరాళాలు ఇవ్వగా తాజాగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ విరాళం అందించారు.

Sukumar : దర్శకుల సంఘానికి డైరెక్టర్ సుకుమార్ విరాళం.. ఎంతంటే..

Director Sukumar Gives Donation to Telugu Film Directors Association

Updated On : August 13, 2024 / 8:22 PM IST

Sirector Sukumar : ఇటీవల కొన్ని రోజుల క్రితం తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ లో దర్శకుడు వీర శంకర్ నేతృత్వంలోని కొత్త ప్యానల్ విజయం సాధించి బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్యానల్ లో రెగ్యులర్ గా సినిమాలు చేసేవాళ్లు, ఇటీవల వచ్చిన యువ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. గతంలో కంటే ఇప్పుడు ఫుల్ యాక్టివ్ గా ఉంటూ డైరెక్టర్ అసోసియేషన్ నుంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అసోసియేషన్ కి నిధులు తీసుకొస్తున్నారు.

ఇప్పటికే డైరెక్టర్ అసోసియేషన్ కి పలువురు సినీ ప్రముఖులు విరాళాలు ఇవ్వగా తాజాగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ విరాళం అందించారు. తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం సభ్యులకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం డైరెక్టర్ సుకుమార్ 5 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. ఈ విషయాన్ని డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు డైరెక్టర్ వీర శంకర్ తెలిపారు.

Also Read : SJ Suryah : 23 ఏళ్ళ తర్వాత ఆ థియేటర్‌కి వెళ్లిన డైరెక్టర్.. అప్పుడు పవన్ కోసం.. ఇప్పుడు నాని కోసం..

దీనిపై సుకుమార్ మాట్లాడుతూ.. తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘానికి ఎప్పుడు అవసరమైనా తాను సపోర్ట్ చేస్తానని తెలిపారు. ఇక సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

Director Sukumar Gives Donation to Tollywood Directors Association