Sukumar : శ్రీతేజ్ కోసం హ‌స్పిట‌ల్‌కు సుకుమార్‌.. 5 ల‌క్ష‌ల సాయం చేసిన సుకుమార్ భార్య‌..

తాజాగా ద‌ర్శ‌కుడు సుకుమార్ సైతం ప‌రామ‌ర్శించారు.

Director Sukumar Visited Hospital For Sree Tej Who Injured In Sandhya Theater Incident

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌లో ఓ మ‌హిళ మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆమె కొడుకు శ్రీతేజ్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ బాలుడి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో వెంటిలేట‌ర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటాన‌ని, చికిత్స‌కు అయ్యే ఖ‌ర్చును పెట్టుకుంటాన‌ని ఇప్ప‌టికే అల్లు అర్జున్ తెలిపారు. అంతేకాకుండా రూ.25 ల‌క్ష‌ల సాయం ప్ర‌క‌టించారు.

కాగా.. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని చూసేందుకు అల్లు అర్జున్ వెళ్లాల‌ని అనుకున్న‌ప్ప‌టికి సెక్యూరిటీ కారణాలు, కోర్టు కేసుతో వెళ్ళలేదు. కిమ్స్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ఇప్ప‌టికే అల్లు అరవింద్ ప‌రామ‌ర్శించ‌గా తాజాగా ద‌ర్శ‌కుడు సుకుమార్ సైతం ప‌రామ‌ర్శించారు.

RRR Documentary Release : ‘ఆర్‌ఆర్ఆర్‌’ డాక్యుమెంటరీ కూడా థియేట‌ర్స్‌లో రిలీజ్ చేస్తున్న రాజ‌మౌళి..

బాలుడి కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి డాక్టర్స్ తో మాట్లాడి తెలుసుకున్నారు.

డిసెంబ‌ర్ 9వ తేదీన శ్రీతేజ్ తండ్రికి ద‌ర్శ‌కుడు సుకుమార్ భార్య రూ.5ల‌క్ష‌ల ఆర్థిక సాయం చేశారు. వైద్య‌, విద్యా, ఆర్థిక సాయం అందిస్తామ‌ని హామీ ఇచ్చారు.

Mohan Babu : మోహన్ బాబు దుబాయ్ పారిపోయాడు.. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దు.. హైకోర్టులో విచారణ..