Teja: డైరెక్టర్ తేజ అహింస కొత్త రిలీజ్ డేట్.. ఎప్పుడంటే..?
డైరెక్టర్ తేజ తెరకెక్కించిన తాజా చిత్రం ‘అహింస’ ఏప్రిల్ 7న రిలీజ్ అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ మూవీ వాయిదా పడగా, ఇప్పుడు సరికొత్త రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

Director Teja Next Movie Ahimsa Locks New Release Date
Teja: టాలీవుడ్ దర్శకుడు తేజ డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘అహింస’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో అభిరామ్ దగ్గుబాటి వెండితెరకు హీరోగా పరిచయం అవుతున్నాడు. గతంలో చాలా మంది హీరోలను ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ చేసిన తేజ, ఈసారి ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్ దగ్గుబాటిని హీరోగా తీసుకొస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అతడి పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
Director Teja : మూవీలకు పాప్‌కార్న్ ముప్పు
కాగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమాలోని సాంగ్స్‌కు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమాను గతంలో ఏప్రిల్ 7న వేసవి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్‌ను చిత్ర యూనిట్ వాయిదా వేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కొత్త రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
Director Teja: టాలీవుడ్ హీరోల లాంచింగ్ ప్యాడ్ తేజ.. ఇప్పుడు మరో కొత్త హీరో!
అహింస చిత్రాన్ని జూన్ 2న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. గీతిక హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా ప్రేక్షకులను.. ముఖ్యంగా యూత్‌ను బాగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో రజత్ బేడి, సదా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి.కుమార్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోండగా, ఆర్పీ పట్నాయక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మరి ఈసారైనా అహింస మూవీ అనుకున్న రోజున రిలీజ్ అవుతుందా లేదా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
మా రఘు కి జన్మదిన శుభాకాంక్షలు❤️
Team #AHIMSA wishes Raghu aka #AbhiramMohanNarayan a very happy birthday!
Witness his Fight for Justice in theatres from JUNE 2nd❤️?@tejagaru @rppatnaik #Kiran @Geethikaactor #Sadaa @SureshProdns @jungleemusicSTH pic.twitter.com/f7PWjkJOyt
— Anandi Art Creations (@AnandiArtsOffl) May 9, 2023