Director Teja: టాలీవుడ్ హీరోల లాంచింగ్ ప్యాడ్ తేజ.. ఇప్పుడు మరో కొత్త హీరో!

వరసగా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చూస్తున్న ఆడియన్స్ కి యూత్ ఫుల్ మూవీస్ తో ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చి.. తనకంటూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు డైరెక్టర్ తేజ. టాలీవుడ్ హీరోలకి..

Director Teja: టాలీవుడ్ హీరోల లాంచింగ్ ప్యాడ్ తేజ.. ఇప్పుడు మరో కొత్త హీరో!

Director Teja

Updated On : February 24, 2022 / 1:09 PM IST

Director Teja: వరసగా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చూస్తున్న ఆడియన్స్ కి యూత్ ఫుల్ మూవీస్ తో ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చి.. తనకంటూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు డైరెక్టర్ తేజ. టాలీవుడ్ హీరోలకి లాంచ్ ప్యాడ్ లా కొత్త హీరోల్ని ఇంట్రడ్యూస్ చేసి కెరీర్ స్టార్టింగ్ లోనే అదిరిపోయే హిట్స్ ఇచ్చిన తేజ.. చాలా కాలం తర్వాత మరో కొత్త హీరోని టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నారు.

Tollywood Love Stories: అంతా ప్రేమమయం.. ప్రేమలో మునిగితేలుతున్న టాలీవుడ్!

ఫిల్మ్ మేకింగ్ తనకంటూ సెపరేట్ ఫార్ములా క్రియేట్ చేసుకున్న ఒకప్పటి స్టార్ డైరెక్టర్ తేజ.. ఇప్పుడు మళ్లీ బిజీ అవుతున్నారు. 2000 నుంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మెంట్ లో తనకంటూ ఓ ట్రెండ్ సెట్ చేసుకున్న తేజ.. మరో కొత్త హీరోని టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు చిన్న కొడుకు అభితేజ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. అహింస టైటిల్ తో ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.

Tollywood : టాలీవుడ్‌లో ఫుల్ జోష్.. విడుదలకు క్యూ కడుతున్న పెద్ద సినిమాలు..

తేజ ఇప్పుడే కాదు.. ఫస్ట్నుంచి టాలీవుడ్ హీరోలకు లాంచ్ పాడ్ గానే ఉన్నారు. 2000లో కెరీర్ స్టార్ట్ చేసిన ఫస్ట్ సినిమా చిత్రంలో ఉదయ్ కిరణ్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు. ఉదయ్ కిరణ్, రీమాసేన్ జంటగా యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ క్రేజీ కాలేజ్ మూవీ ట్రెండ్ సెట్ చేసి సూపర్ హిట్ అయ్యింది. ఆ దెబ్బతో ఎంట్రీతోనే అటు ఉదయ్, ఇటు తేజ వరసగా అవకాశాలతో బిజీ అయిపోయారు.

Abhiram : దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో.. రానా తమ్ముడు అభిరామ్ ఎంట్రీ

తెలుగు సినిమాకి మరో క్యూట్ హీరోని అందించారు తేజ. లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న తేజ.. 2002లో చేసిన జయం సినిమాతో కొత్త హీరో నితిన్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సదా, నితిన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ హార్డ్ కోర్ లవ్ స్టోరీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఈ సినిమాలో పాటలు యూత్ ని ఎట్రాక్ట్ చేస్తూనే ఉన్నాయి.

Rana Daggubati : భళ్లాలదేవ క్రేజ్‌ని ‘బీమ్లా నాయక్’ ఎందుకు వాడట్లేదు??

జయం హిట్ కంటిన్యూ అవుతూ ఉండగానే మరో రెండేళ్లకు మరో కొత్త హీరోని పరిచయం చేశారు. క్రేజీ క్యారెక్టర్లతో ఆడియన్స్ కి బాగాకనెక్ట్ అయిన నవదీప్ ని క్యూట్ బాయ్ గా జై సినిమాతో పరిచయం చేశారు తేజ. 2004లో వచ్చిన జై సినిమాలో తన అమాయకత్వంతో యూత్ ని విపరీతంగా ఎట్రాక్ట్ చేశారు నవదీప్. జై సినిమా బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ అయినా.. పేట్రియాటిజం లాంటి పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో మిక్స్ చేసి సినిమాని సూపర్ హిట్ చేశారు. ఇలా 20 ఏళ్ల నుంచి కొత్త హీరోల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్న తేజ.. ఇప్పుడు కూడా ఆ ట్రెండ్ ని కంటిన్యూ చేస్తున్నారు.