Director VN Aditya Direct Swapnala Nava Private Song in America in the Memory of Sirivennela Seetharama Sastry
VN Aditya : మనసంతా నువ్వే, నేనున్నాను.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్ డా.వి.ఎన్.ఆదిత్య ఇటీవల ‘స్వప్నాల నావ’ అనే ఓ ప్రైవేట్ సాంగ్ తెరకెక్కించారు. డల్లాస్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్, తెలుగువాడు గోపీకృష్ణ కొటారు ‘శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా ఈ ‘స్వప్నాల నావ’ మ్యూజిక్ వీడియోని నిర్మించారు. గోపికృష్ణ కుమార్తె శ్రీజ కొటారు ఈ పాటను ఆలపించడమే కాకుండా ఇందులో నటించింది.
Also Read : Baapu : ‘బాపు’ మూవీ ‘రివ్యూ’.. తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో మరో సినిమా.. ఎలా ఉందంటే..?
ఈ ‘స్వప్నాల నావ’ చదువులో ఫెయిలయిన విద్యార్థినీ విద్యార్థులను మోటివేట్ చేసే పాట ఇది.
దివంగత పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి దివ్య స్మృతికి అంకితంగా ఈ పాటను తెరకెక్కించారు. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు పార్థసారథి నేమాని సంగీత దర్శకత్వంలో యశ్వంత్ ఆలూరు ఈ పాటకి సాహిత్యం సమకూర్చారు. మీరు కూడా ఈ పాట వినేయండి..
‘స్వప్నాల నావ’ తో సిరివెన్నెల గారి గొప్పతనాన్ని, ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటి చెప్పారు ఈ టీమ్. ఇటీవల శ్రీ క్రియేటివ్స్ USA యూట్యూబ్ ఛానల్ లో రిలీజైన ఈ పాటకు 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తూ వీక్షకులకి కృతజ్ఞతలు తెలిపారు. టాలీవుడ్ గర్వించదగ్గ దిగ్గజ రైటర్ కమ్ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి డా. VN ఆదిత్య గొప్ప ట్రిబ్యూట్ ఇచ్చారు అంటూ ఆయన్ని అభినందిస్తున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి దివ్య స్మృతికి అంకితంగా ఈ పాటని ఓఎమ్జీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినీ నిర్మాత మీనాక్షి అనిపిండి సమర్పకురాలిగా నిర్మించారు. ఈ సాంగ్ ని పూర్తిగా అమెరికాలోని డల్లాస్ లోనే షూట్ చేశారు.
Also Read : Manisharma : మెగాస్టార్ పై అభిమానంతో మరోసారి రక్తదానం చేసిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..