VV Vinayak: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఆ సినిమాకు సీక్వెల్ ఉండదు.. బల్లగుద్ది చెప్పిన డైరెక్టర్
అదుర్స్ సీక్వెల్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన దర్శకుడు వీవీ వినాయక్(VV Vinayak).
Director VV Vinayak Shocking Comments on Adhurs Sequel
- అదుర్స్ సీక్వెల్ పై వీవీ వినాయక్ షాకింగ్ కామెంట్స్
- సీక్వెల్ కి స్కోప్ లేదని స్పష్టం
- అదుర్స్ ఒక జ్ఞాపకం అంటూ కామెంట్స్
VV Vinayak: టాలీవుడ్ ప్రేక్షకుల ఆల్‌టైమ్ క్లాసిక్ కామెడీ ఎంటర్టైనర్ అంటే ‘అదుర్స్’ అనే చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో, ముఖ్యంగా ‘చారి’ పాత్రతో సృష్టించిన వినోదం గురించి ఎంత చెప్పినా తక్కువే. మరీ ముఖ్యంగా బ్రహ్మానందం-ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్లు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Badshah Wedding: రహస్యంగా పెళ్లి చేసుకున్న ర్యాప్ సింగర్ బాద్షా.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా?
అయితే, ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుందని, రచయిత కోన వెంకట్ ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం చేశారని గతంలో వార్తలు రావడంతో నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ, తాజాగా ఒక సినిమా వేడుకలో పాల్గొన్న దర్శకుడు వీవీ వినాయక్(VV Vinayak) ఈ విషయంపై అత్యంత స్పష్టతనిచ్చారు. ‘అదుర్స్-2’ గురించి ఆయన మాట్లాడుతూ, ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఆ కథ అక్కడితోనే ముగిసిపోయిందని తేల్చి చెప్పారు.
సీక్వెల్ చేసేందుకు ఇప్పుడు అందులో ఏమీ మిగలలేదు, ఒకవేళ బలవంతంగా తీసినా మొదటి భాగం అందించినంత గొప్ప వినోదాన్ని మళ్లీ రీక్రియేట్ చేయగలమన్న నమ్మకం తనకు లేదని ఆయన నిజాయితీగా ఒప్పుకున్నారు. అందుకే ఆ సినిమాను ఒక అందమైన జ్ఞాపకంలా వదిలేయడమే మంచిదని వినాయక్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రకటనతో ‘అదుర్స్’ సీక్వెల్ కోసం వేచి చూస్తున్న అభిమానులకు నిరాశ తప్పలేదు.
