BappiLahiri-Chiru : చిరంజీవికి లైఫ్ టైం బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన బప్పీ లహరి

మెగా స్టార్ చిరంజీవి సినిమాల్లోని పాటలంటేనే సగటు సినీ అభిమానులకు ఓ పూనకం. ఆయన కొత్త సినిమా ఎప్పుడు తీస్తారా.. అందులో ఆడియో ఎప్పుడు రిలీజవుతుందా అనే ఉత్కంఠ అప్పట్లో..

BappiLahiri-Chiru : చిరంజీవికి లైఫ్ టైం బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన బప్పీ లహరి

Chiranjeevi Bappi Lahiri

Updated On : February 16, 2022 / 8:41 AM IST

BappiLahiri-Chiru : బాలీవుడ్ మ్యూజిక్ లెజెండ్ బప్పీ లహరి కన్నుమూశారు. ఆయనకు తెలుగు సినిమాతో విడదీయలేని అనుబంధం ఉంది. తెలుగు సినీ పరిశ్రమను కొన్ని దశాబ్దాలుగా ఏలుతున్న టాప్ హీరోల సినిమాలకు ఆయన సంగీతం అందించారు. అగ్ర హీరోల కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్లు అనిపించుకున్న సినిమాల్లో బప్పీ లహరి అందించిన మ్యూజిక్, పాటలు.. ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి.

మెగా స్టార్ చిరంజీవి సినిమాల్లోని పాటలంటేనే సగటు సినీ అభిమానులకు ఓ పూనకం. ఆయన కొత్త సినిమా ఎప్పుడు తీస్తారా.. అందులో ఆడియో ఎప్పుడు రిలీజవుతుందా అనే ఉత్కంఠ అప్పట్లో ఇప్పటికే ఎక్కువగా ఉండేది. అలాంటి చిరంజీవి అభిమానులను తన పాటలతో కిర్రెక్కించి ఇప్పటికీ స్టెప్పులేయిస్తున్నారు బప్పీ లహరి.

చిరంజీవితో మొత్తం నాలుగు సినిమాలకు బప్పీ లహరి మ్యూజిక్ అందించారు. అవి
1.స్టేట్ రౌడీ(1989)
2. గ్యాంగ్ లీడర్(1991)
3.రౌడీ అల్లుడు(1991)
4.బిగ్ బాస్(1995)

Read This : Bappi Lahiri: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీ లహరి కన్నుమూత

మెగాస్టార్- బప్పీ లహరి కాంబినషన్ లో వచ్చిన ఈ నాలుగు సినిమాల్లో 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లే. బిగ్ బాస్ లో రీరికార్డింగ్.. పాటలు కూడా పాపులర్.

స్టేట్ రౌడీలో అరె మూతిమీద మీసమున్న, తదిగిన తోం, రాధా రాధా మదిలోన మన్మధ బాధ, చుక్కల పల్లకిలో, వన్ టూ త్రీ పాటలు.. మెగా చార్ట్ బస్టర్ లిస్టులో టాప్ లో ఉండిపోతాయి.

గ్యాంగ్ లీడర్ సినిమాలోని భద్రాచలం కొండా సీతమ్మ వారి దండ, వానా వాన వెల్లువాయె, వయసు వయసు వయసు, పని సాససా, పాపా రీటా, పాల బుగ్గ పాటలు.. మెగా అభిమానులకు సుప్రభాతం లాంటివి.

మాస్ హిట్ రౌడీ అల్లుడు మూవీలోని అమలాపురం బుల్లోడా, చిలుకా క్షేమమా, కోరి కోరి కాలుతుంది ఈడు, లవ్ మీ మై హీరో, ప్రేమ గీమ తస్సాదియ్యా, స్లోలీ స్లోలీ, తద్దినకా.. తప్పదికా పాటలు ఇప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్సే.

బిగ్ బాస్ లో మావా మావా, ఉరుమొచ్చేసిందోయ్, నీ లాంటి రేవునోనా, నంబర్ 1, 2, సూదికి దారం పాటలు కూడా అప్పట్లో ఊపు ఊపిన పాటలే.

బప్పీ లహరి మరణంతో సంగీతాన్ని ప్రేమించే వాళ్లేకాదు.. చిరంజీవి అభిమానులు కూడా తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. నీవు లేకపోయినా నీ పాట నిలిచే ఉంటుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Read This : Chiranjeevi: చిరు లైనప్.. సినిమాకో హీరోకి అవకాశమిస్తున్న మెగాస్టార్!