Kalki 2898 AD : కల్కి సెట్స్‌లోని ఫోటోలు షేర్ చేసిన దిశా పటాని.. ప్రభాస్‌తో సెల్ఫీ వైరల్..

కల్కి సెట్స్‌లోని ఫోటోలు షేర్ చేసిన దిశా పటాని. ఆ ఫొటోల్లో ప్రభాస్‌తో దిగిన సెల్ఫీ నెట్టింట వైరల్ గా మారింది.

Disha Patani dropa selfie with Prabhas from the sets of Kalki 2898 AD

Kalki 2898 AD : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ మూవీ ‘కల్కి 2898 AD’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టినట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ఇటీవల చిత్ర యూనిట్.. ప్రభాస్ అండ్ దిశా పై ఇటలీలో ఒక అందమైన సాంగ్ ని చిత్రీకరించారు. అందుకు సంబంధించిన రెండు మూడు ఫోటోలను చిత్ర నిర్మాతలు చేశారు. తాజాగా దిశా పటాని ఆ షెడ్యూల్ కి సంబంధించిన మరికొన్ని ఫోటోలను, వీడియోలను షేర్ చేసారు. ఆ పిక్స్ తో ఇటలీలోని అందమైన ల్యాండ్‌స్కెప్స్, బీచ్స్, సిటీస్ కనిపిస్తున్నాయి. ఆ ఫొటోల్లోనే ప్రభాస్ తో దిశా దిగిన ఓ సెల్ఫీ కూడా ఉంది. ప్రస్తుతం సెల్ఫీ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.

Also read : Ranbir Kapoor : బాలీవుడ్ రామాయణం కోసం ఇద్దరు ఆస్కార్ విన్నర్లు.. హాలీవుడ్ టాప్ సినిమాలకు మ్యూజిక్..

కాగా ఈ సినిమాని మే 9న రిలీజ్ చేస్తామంటూ గతంలో ప్రకటించారు. అయితే ఆ డేట్ లో ఎలక్షన్స్ రావడంతో సినిమాని పోస్టుపోన్ చేయడానికి సిద్దమయ్యినట్లు సమాచారం. ఆ డేట్ నుంచి వాయిదా వేస్తూ.. బాహుబలి రిలీజ్ డేట్ జులై 10న గాని లేదా మే 31న గాని సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు రావాలని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఫైనల్ గా ఏ డేట్ కి ఫిక్స్ అవ్వుతారో చూడాలి.

ఇక సినిమా పోస్టుపోన్ అవ్వడం ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అవ్వడంతో.. అభిమానులు మూవీ నుంచి ఒక సాంగ్ అయినా రిలీజైతే బాగుండు అని ఫీల్ అవుతున్నారు. ఈక్రమంలోనే చిత్ర నిర్మాతలకు సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ లు పెడుతున్నారు. మరి ప్రొడ్యూసర్స్ ఈ రిక్వెస్ట్ లను లెక్క తీసుకోని ఏమైనా అప్డేట్ ఇస్తారో లేదో చూడాలి.