Ranbir Kapoor : బాలీవుడ్ రామాయణం కోసం ఇద్దరు ఆస్కార్ విన్నర్లు.. హాలీవుడ్ టాప్ సినిమాలకు మ్యూజిక్..
బాలీవుడ్ రామాయణంకి మ్యూజిక్ చేయడం కోసం ఇద్దరు ఆస్కార్ విన్నర్లు రాబోతున్నారట. పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్, మిషన్ ఇంపాజిబుల్ వంటి సినిమాలకు..

AR Rahman Hans Zimmer is on board for Ranbir Kapoor Ramayana
Ranbir Kapoor : రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా బాలీవుడ్ లో మరో రామాయణం తెరకెక్కబోతుంది. దంగల్ దర్శకుడు నితేశ్ తివారీ ఈ రామాయణాన్ని తెరకెక్కించబోతున్నారట. మొత్తం మూడు భాగాలుగా ఈ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ చిత్రం శరవేగంగా పనులు జరుపుకుంటుంది.
కాగా ఈ మూవీకి మ్యూజిక్ చేయడం కోసం ఇద్దరు ఆస్కార్ విన్నర్లు రాబోతున్నారట. ఇండియన్ ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్, హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ హన్స్ జిమ్మెర్ (Hans Zimmer) కలిసి ఈ భారతీయ రామాయణానికి మ్యూజిక్ చేయడానికి సిద్దమయ్యారట. హన్స్ జిమ్మెర్ హాలీవుడ్ టాప్ సినిమాలకు మ్యూజిక్ చేసారు.
Also read : Pushpa 2 : రష్మిక బర్త్ డే గిఫ్ట్.. పుష్ప 2 నుంచి శ్రీలీల లుక్..
ది లయన్ కింగ్, గ్లాడియేటర్, పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్, ది డార్క్ నైట్ ట్రయాలజీ, ఇన్‌సెప్షన్, మ్యాన్ ఆఫ్ స్టీల్, ఇంటర్‌స్టెల్లార్, డంకిర్క్, నో టైమ్ టు డై, మిషన్ ఇంపాజిబుల్, డూన్ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ కి సంగీతం అందించింది హన్స్ జిమ్మెరే. రాముడి కథ విన్న తరువాత ఈ మ్యూజిక్ దర్శకుడు కూడా ఈ సినిమాకి సంగీతం అందించడం కోసం ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారట.
మరి ఇద్దరు ఆస్కార్ విన్నర్స్ కలిసి ఇస్తున్న మ్యూజిక్ తో రామునిగాధ ఎలా ఉండబోతుందో చూడాలి. కాగా ఈ సినిమాని ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారట. జూన్, జులైలో సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేసి.. వచ్చే ఏడాది దివాళీకి మొదటి పార్ట్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు రానున్నారట. కాగా ఈ మూవీలో రావణాసురుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.