Pushpa 2 : రష్మిక బర్త్ డే గిఫ్ట్.. పుష్ప 2 నుంచి శ్రీవల్లి లుక్..
నేడు రష్మిక పుట్టినరోజు కావడంతో పుష్ప 2 సినిమా నుంచి శ్రీవల్లి ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.

Rashmika Mandanna first loook release from Allu Arjun Pushpa 2
Pushpa 2 : అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్స్ నటిస్తున్న చిత్రం పుష్ప 2. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మొదటి పార్ట్ కి వచ్చిన హైప్ ని దృష్టిలో పెట్టుకొని సుకుమార్ ఈ చిత్రాన్ని చాలా భారీగా తెరకెక్కిస్తున్నారు. కాగా నేడు రష్మిక పుట్టినరోజు కావడంతో ఈ మూవీలో శ్రీవల్లి ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.
పుష్ప 1 సమయంలో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో రష్మిక చాలా సింపుల్ గా పల్లెటూరి అమ్మాయిలా కనిపించారు. ఇక ఈ సెకండ్ పార్ట్ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో పట్టు చీర, ఒంటి నిండా నగలు, కాటుక కళ్ళతో పవర్ ఫుల్ లేడీగా కనిపిస్తున్నారు. ఈ సెకండ్ పార్ట్ లో శ్రీవల్లి పాత్ర కూడా పుష్పలా పవర్ ఫుల్ గా ఉంటుందని రష్మిక గతంలోనే చెప్పారు. ఇప్పుడు ఈ పోస్టర్ చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.
Also read : Rashmika Mandanna : హీరో ఉన్నా లేకున్నా.. తాను మాత్రం తగ్గేదేలే అంటున్న రష్మిక..
Wishing the ??????’? ?????????? ‘Srivalli’ aka @iamRashmika a very Happy Birthday ??#Pushpa2TheRuleTeaser on April 8th ?#PushpaMassJaathara ?#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG 2024.
Icon Star @alluarjun @aryasukku #FahadhFaasil… pic.twitter.com/AnsbEXZqJT
— Pushpa (@PushpaMovie) April 5, 2024
కాగా ఈ నెల 8న అల్లు అర్జున్ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రోజు మూవీ నుంచి టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ మూవీలో హైలైట్ సీన్ గా చెబుతున్న జాతర సీక్వెన్స్ తో టీజర్ ని కట్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ టీజర్ కి దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని రెడీ చేసి పెట్టారంట. మరి మరో మూడు రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న టీజర్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.