Rashmika Mandanna : హీరో ఉన్నా లేకున్నా.. తాను మాత్రం తగ్గేదేలే అంటున్న రష్మిక..

హీరో ఉన్నా లేకున్నా తాను మాత్రం తగ్గేదేలే అంటున్న రష్మిక. నేడు ఈ నేషనల్ క్రష్ పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే.

Rashmika Mandanna : హీరో ఉన్నా లేకున్నా.. తాను మాత్రం తగ్గేదేలే అంటున్న రష్మిక..

The Girlfriend first look posters released on Rashmika Mandanna birthday

Updated On : April 5, 2024 / 10:31 AM IST

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న నార్త్ టు సౌత్ బడా హీరోలతో సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్స్ ని అందుకుంటూ పాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకుంటున్నారు. చివరిగా ‘యానిమల్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రష్మిక.. ఆ మూవీతో బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. ఇక త్వరలో మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2తో రాబోతున్నారు. ఈ సినిమా కాకుండా రష్మిక పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ని కూడా చేస్తున్నారు.

వీటిలో రెండు లేడీ ఓరియంటెడ్ మూవీస్ కావడం విశేషం. ఒకటి ‘ది గర్ల్ ఫ్రెండ్’, మరొకటి ‘రెయిన్ బో’. ఇక నేడు రష్మిక పుట్టినరోజు కావడంతో ఈ సినిమాల నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. ఈక్రమంలోనే గర్ల్ ఫ్రెండ్ మూవీ నుంచి రెండు పోస్టర్స్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్టర్స్ లో రష్మిక సింపుల్ కాలేజీ స్టూడెంట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ పోస్టర్ లోనే సినిమా ఎన్ని లాంగ్వేజ్స్ లో రిలీజ్ కాబోతుందో తెలియజేసారు.

Also read : Thandel : నాగచైతన్య సినిమా కోసం రంగంలోకి దిగిన యానిమల్ మేకర్స్.. ఈపాలి ఏట గురితప్పేదేలే..

టాలీవుడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని.. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. నార్మల్ లవ్ స్టోరీతో వస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీని కూడా ఇలా మల్టీ లాంగ్వేజ్స్ లో రిలీజ్ చేస్తూ.. హీరో ఉన్నా లేకున్నా, తాను మాత్రం తగ్గేదేలే అని రష్మిక ఆడియన్స్ కి తెలియజేస్తున్నారు. కాగా ఈ గర్ల్ ఫ్రెండ్ సినిమాని రాహుల్‌ రవీంద్రన్‌ డైరెక్ట్ చేస్తున్నారు.

గీత ఆర్ట్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి మేల్ లీడ్ చేస్తున్నారు. హేశం అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని త్వరలోనే ఆడియన్స్ ముందుకు తీసుకు రానున్నారు. మరి ఈ లేడీ ఓరియంటెడ్ మూవీతో రష్మిక ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.