Thandel : నాగచైతన్య సినిమా కోసం రంగంలోకి దిగిన యానిమల్ మేకర్స్.. ఈపాలి ఏట గురితప్పేదేలే..

ఈపాలి ఏట గురితప్పేదేలే అంటున్న నాగచైతన్య. 'తండేల్' సినిమా కోసం రంగంలోకి దిగిన యానిమల్ మేకర్స్.

Thandel : నాగచైతన్య సినిమా కోసం రంగంలోకి దిగిన యానిమల్ మేకర్స్.. ఈపాలి ఏట గురితప్పేదేలే..

Animal movie stunt master working for Naga Chaitanya Thandel

Updated On : April 5, 2024 / 9:46 AM IST

Thandel : యువ సామ్రాట్ నాగచైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘తండేల్’. దాదాపు 55 కోట్ల పైగా బడ్జెట్ తో గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు. రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుంది.

ప్రస్తుతం ఈ మూవీలోని యాక్షన్ పార్ట్‌ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించడం కోసం ‘యానిమల్’ మూవీ మేకర్స్ రంగంలోకి దిగారట. యానిమల్ సినిమాకి యాక్షన్ పార్ట్ డిజైన్ చేసిన ఫేమస్ స్టంట్ మాస్టర్ సుప్రీమ్ సుందర్.. తండేల్ అదిరిపోయే భారీ యాక్షన్ సీక్వెన్స్ ని డైరెక్ట్ చేస్తున్నారట. సినిమాలో ఈ సీక్వెన్స్ ఆడియన్స్ చేత విజుల్స్ వేయిస్తుందని ఫిలిం వర్గాల్లో చెబుతున్నారు.

Also read : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ భారీ కట్ అవుట్.. రౌడీ బాయ్ ఎమోషనల్ పోస్ట్..

తండేల్ కోసం పని చేస్తున్న వారిని చూస్తుంటే.. ఈపాలి ఏట నిజంగానే గురితప్పదు అనిపిస్తుంది. ‘బంగార్రాజు’ తరువాత చైతన్య నుంచి సరైన హిట్ పడలేదు. దీంతో చైతన్య ఫ్యాన్స్ ఒక సూపర్ కమ్‌బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా పై నిర్మాతలు వ్యక్తం చేస్తున్న ధీమా చూసి ఫ్యాన్స్ లో మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి ఆ అంచనాలను మేకర్స్ అందుకుంటారా లేదా చూడాలి.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన హీరో అనుకోకుండా పాకిస్థాన్ అధికారులకు చిక్కుకుంటారు. అక్కడ హీరో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి..? పాకిస్తాన్ నుంచి మళ్ళీ ఇండియాకి ఎలా తిరిగి వచ్చాడు..? అనే దానికి ప్రేమ కథని, దేశభక్తిని జోడించి సినిమాని కమర్షియల్ గా తీస్తున్నారు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.