Divi – Mahesh Babu : మహేష్ బాబుకి అక్కడ పుట్టుమచ్చ ఉంది.. షూట్ లో దాని గురించి మాట్లాడితే.. మహర్షిలో చాలా సీన్స్ చేశా కానీ..
దివి మహర్షి సినిమా గురించి, మహేష్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Divi Interesting Comments on Mahesh Babu Birth Marks
Divi – Mahesh Babu : నటి దివి సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా సినిమాలు, సిరీస్ లు చేస్తుంది. తాజాగా దివి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలు తెలిపింది.
అయితే దివి బిగ్ బాస్ సమయంలో మొదట మహేష్ బాబు మహర్షి సినిమాలో చేసిందని వైరల్ అయింది. అప్పట్లో మహేష్ సినిమాలో దివి కనిపించిన సీన్స్ బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దివి మహర్షి సినిమా గురించి, మహేష్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Also Read : RGV : నా లైఫ్ లో నేను కౌగిలించుకున్న ఏకైన మగాడు అతనే.. ఆర్జీవీ వ్యాఖ్యలు.. ఇంతకీ ఆ మగాడు ఎవరు..?
దివి మాట్లాడుతూ.. మహేష్ బాబు చాలా అందగాడు. ఆ షూట్ లో అమ్మాయిలు అంతా మహేష్ గురించి, మహేష్ అందం గురించే మాట్లాడుకునేవాళ్ళం. షూట్ లో ఒక్క అబ్బాయి బాగోడు. మహేష్ మాత్రం తళతళ మెరిసిపోతాడు. మహేష్ కి నాతో చాలా సీన్స్ ఉన్నాయి. ఆ సినిమాలో నాది పెద్ద రోల్. కానీ ఎడిటింగ్ లో చాలా సీన్స్ తీసేసారు. ఆయనకు నుదురు మీద పైకి పుట్టుమచ్చ ఉంటుంది. మా ఇద్దరి మధ్య సీన్ జరుగుతుంటే గాలికి హెయిర్ పైకి అనుకుంటే ఆ పుట్టుమచ్చ చూసాను. ఒక సీన్ లో నేను, మహేష్ గారు మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేయాలి. అప్పుడు మీ ఫోర్ హెడ్ మీద పుట్టుమచ్చ చాలా బాగుంది సర్ అని అన్నాను. వెంటనే నవ్వి సీన్ కి కట్ చెప్పి పడి పడి నవ్వారు. సితార కూడా ఇలాగే చెప్తుంది. సితారకు కూడా ఈ పుట్టుమచ్చ బాగుంటుంది అని చెప్తుంది అన్నారు. మహర్షి సినిమాకు బోలెడన్ని మెమరీస్ ఉన్నాయి. ఆయనతో మళ్ళీ చేయాలి అని తెలిపింది. దీంతో మహేష్ పుట్టుమచ్చ గురించి మాట్లాడిన దివి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
అలాగే.. మహేష్ – రాజమౌళి సినిమాలో నటించాలని ఉంది. ఎప్పట్నుంచో రాజమౌళి సినిమాలో యాక్ట్ చేయాలని ఉంది. ఈ సినిమాకు బాగా ట్రై చేస్తున్నాను. రాజమౌళి టీమ్ లో తెలిసిన వాళ్ళందర్నీ అడుగుతున్నాను ఒక పాత్ర కోసం. ఛాన్స్ వస్తే ఆడిషన్ కూడా ఇస్తాను. ఆ సినిమాలో నటించాలి అని తెలిపింది దివి.
View this post on Instagram