Siddu Jonnalagadda: మ‌ల‌యాళ హిట్ మూవీ రీమేక్‌లో డీజే వాయిస్తున్న టిల్లు.. నిజమేనా?

DJ Tilluతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో జొన్నలగడ్డ సిద్దు ఇప్పుడు వరస సినిమాలు లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం DJ Tillu 2 తెరకెక్కించే పనిలో ఉన్న సిద్దు ఒక మలయాళం హిట్ మూవీ రీమేక్ పై కన్నేశాడని తెలుస్తుంది.

Siddu Jonnalagadda: మ‌ల‌యాళ హిట్ మూవీ రీమేక్‌లో డీజే వాయిస్తున్న టిల్లు.. నిజమేనా?

DJ Tillu in Malayalam Hit Movie Remake

Updated On : September 1, 2022 / 6:05 PM IST

Siddu Jonnalagadda: డీజే టిల్లుతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్దు జొన్నలగడ్డ ఇప్పుడు వరస సినిమాలు లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం DJ Tillu – 2 తెరకెక్కించే పనిలో ఉన్న సిద్దు ఒక మలయాళ హిట్ మూవీ రీమేక్ పై కన్నేశాడని తెలుస్తుంది. DJ Tillu ఇచ్చిన సక్సెస్ ని నిలబెట్టుకోడానికి సిద్దు కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

Sree Leela In For DJ Tillu 2: డీజే టిల్లు కోసం ధమాకా లాంటి బ్యూటీ..?

ఇక డీజే టిల్లుకి విమ‌ల్ కృష్ణ దర్శకత్వం వహించగా.. సీక్వెల్ ని మ‌ల్లిక్ రామ్ డైరెక్ట్ చేయ‌బోతున్నాడ‌ని, ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారని వార్త‌లు వస్తునప్పటికీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.

DJ Tillu: మళ్లీ లొల్లి షురూ చేస్తోన్న డీజే టిల్లు!

కాగా మ‌ల‌యాళ స్టార్ హీరో టొవినో థామ‌స్ లీడ్ రోల్‌లో న‌టించిన‌ హిట్ మూవీ ‘థ‌ళ్లుమాల’ తెలుగు రీమేక్ లో సిద్దు నటించబోతున్నట్టు తెలుస్తుంది. దీని విషయమై సిద్దుని ఒక నిర్మాణ సంస్థ సంప్రదించినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలో ఎంత వరకు నిజమున్నది అనేది తెలియాలంటే అధికారక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.