Do Yo Want to Participate in Bigg Boss Season 9 Here The Details
Bigg Boss 9 : రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకోగా త్వరలో 9 వ సీజన్ రాబోతున్నట్టు ప్రకటించారు. ఈసారి కూడా నాగార్జుననే హోస్ట్ చేయబోతున్నాడు. సాధారణంగా బిగ్ బాస్ అంటే సెలబ్రిటీలు పార్టిసిపేట్ చేస్తారు. గతంలో ఓ రెండు సార్లు సామాన్యులను కూడా తీసుకొస్తాము అని అంతగా ఫేమ్ లేని కొంతమందిని షోలోకి తీసుకొచ్చారు.
ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ సామాన్య ప్రజలకు ఆ ఛాన్స్ ఇస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 లో మీరు కూడా పాల్గొనచ్చు అని ఓ వీడియో రిలీజ్ చేసారు. ఈ వీడియోలో నాగార్జున మాట్లాడుతూ.. ఇన్నాళ్లు మీరు బిగ్ బాస్ ని ప్రేమించారు. మేము ఆ ప్రేమకు రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తున్నాం. సెలబ్రిటీలు మాత్రమే కాదు మీకు కూడా బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నాం అని తెలిపారు.
Also Read : ENE2 : ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ అనౌన్స్.. టైటిల్ ఇదే..
బిగ్ బాస్ సీజన్ 9 లో పాల్గొనాలంటే https://bb9.jiostar.com ఈ లింక్ లోకి వెళ్లి మీ పేరు, ఫోన్ నంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. అలాగే ఒక మూడు నిముషాలు మీ గురించి, మీరు ఎందుకు బిగ్ బాస్ కి వెళ్ళాలి అనుకుంటున్నారో తెలియచేస్తూ ఒక వీడియో చేసి అప్లోడ్ చేయాలి. మరి మీరు కూడా బిగ్ బాస్ లో పాల్గొనాలి అంటే అప్లై చేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.