Anil Ravipudi – Venkatesh : సంక్రాంతికి వస్తున్నాం హిట్ కాంబో.. అనిల్ రావిపూడి – వెంకటేష్ ఫస్ట్ కలిసి పనిచేసిన సినిమా ఫ్లాప్ అని తెలుసా..?

అనిల్ రావిపూడి - వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చి భారీ బ్లాక్ బస్టర్ కొట్టారు.

Do You Know about Anil Ravipudi Venkatesh First Movie Flop Details Here

Anil Ravipudi – Venkatesh : ఇటీవల సంక్రాంతి పండక్కి అనిల్ రావిపూడి – వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చి భారీ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ తో పాటు ఓ చిన్న మెసేజ్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని నవ్వించి మెప్పించి సూపర్ హిట్ చేసారు సినిమాని. ఈ సినిమా ఆల్మోస్ట్ 270 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ట్రిపుల్ ప్రాఫిట్స్ తెచ్చింది. త్వరలో 300 కోట్ల గ్రాస్ అందుకోబోతుంది.

వెంకటేష్ అంటేనే ఎంటర్టైన్మెంట్ కి, ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్. ఇక అనిల్ రావిపూడి ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీస్తూ వరుస హిట్స్ కొడుతున్నాడు. ఇలాంటి ఈ ఇద్దరూ కలిస్తే సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఫుల్ రేంజ్ లో ఉంటుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వీళ్లిద్దరి కాంబోలో గతంలో F2, F3 సినిమాలు వచ్చి పెద్ద హిట్ అయ్యాయి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరో హిట్ కొట్టి హ్యాట్రిక్ హిట్ కాంబో అనిపించుకున్నారు. తర్వాత కూడా వీరిద్దరి కాంబోలో మరిన్ని సినిమాలు వస్తాయని ఆల్రెడీ ప్రకటించారు.

Also Read : Allari Naresh : నాన్న చావు బతుకుల్లో.. కామెడీ సీన్స్ షూటింగ్ లో అల్లరి నరేష్.. ఈ కష్టం ఎవ్వరికి రాకూడదు.. అందుకే ఆ సినిమాని..

అయితే ఈ హిట్ కాంబో మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారో తెలుసా? వీరిద్దరూ మొదటిసారి కలిసి పనిచేసిన సినిమా ఫ్లాప్ అని మీకు తెలుసా? డైరెక్టర్ గా మారకముందు అనిల్ రావిపూడి రచయితగా చాలా సినిమాలకు పనిచేసాడు. అలా వెంకటేష్ – రామ్ కలిసి నటించిన మసాలా సినిమాకు అనిల్ రావిపూడి డైలాగ్ రైటర్ గా పనిచేసాడు. హిందీలో వచ్చిన బోల్ బచ్చన్ సినిమాకు రీమేక్ గా మసాలా సినిమాని తెరకెక్కించారు. వెంకటేష్, రామ్ హీరోలుగా అంజలి, షాజన్ పదాంసీ హీరోయిన్స్ గా ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాని ఒకప్పటి స్టార్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ తెరకెక్కించారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి డైలాగ్స్ అందించాడు. అయితే మసాలా సినిమా ఫ్లాప్ అయింది. అలా వెంకటేష్ – అనిల్ రావిపూడి మొదటగా కలిసి పనిచేసిన సినిమా మషాలా ఫ్లాప్ అయింది.

Also Read : Hari Hara Veera Mallu : మాట వినాలి పాట‌ను ప‌వ‌న్ ఎలా పాడారో చూశారా? బీటీఎస్ వ‌చ్చేసింది..

ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ లో వెంకటేష్ ఈ విషయం గురించి తెలిపాడు. రానా అనిల్ రావిపూడిని, వెంకటేష్ ని మొదటగా మషాలా సినిమా సమయంలో కలిపించాడు. ఆ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ లోనే తెరకెక్కింది. అప్పట్లోనే డైలాగ్స్ బాగా రాసేవాడు, మంచి ఎనర్జీ ఉండేది అంటూ అనిల్ గురించి చెప్పాడు వెంకటేష్.