Allari Naresh : నాన్న చావు బతుకుల్లో.. కామెడీ సీన్స్ షూటింగ్ లో అల్లరి నరేష్.. ఈ కష్టం ఎవ్వరికి రాకూడదు.. అందుకే ఆ సినిమాని..
ఇప్పుడంటే విభిన్న పాత్రలు,కథలు ట్రై చేస్తున్నాడు కానీ ఒకప్పుడు ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు నరేష్.

Allari Naresh Done Comedy Scenes Shooting while his Father in Critical Condition Details Here
Allari Naresh : సినిమాల్లో నవ్వించే వారి జీవితాల్లో బాధలు కూడా ఎక్కువే ఉంటాయి అంటారు. తన కామెడీ సినిమాలతో ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలంకరిస్తూనే ఉన్నాడు అల్లరి నరేష్. ఇప్పుడంటే విభిన్న పాత్రలు,కథలు ట్రై చేస్తున్నాడు కానీ ఒకప్పుడు ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు నరేష్. అల్లరి నరేష్ తండ్రి ఎన్నో కామెడీ ఎంటర్టైనర్స్ ఇచ్చిన లెజెండరీ డైరెక్టర్ EVV సత్యనారాయణ అని అందరికి తెలిసిందే.
Also Read : Hari Hara Veera Mallu : మాట వినాలి పాటను పవన్ ఎలా పాడారో చూశారా? బీటీఎస్ వచ్చేసింది..
ఓ సమయంలో EVV సత్యనారాయణ చావు బతుకుల్లో ఆఖరి క్షణాల్లో హాస్పిటల్ లో ఉంటే అల్లరి నరేష్ ఓ సినిమా క్లైమాక్స్ కామెడీ సీన్స్ షూటింగ్ చేయాల్సి వచ్చింది. EVV సత్యనారాయణ 2011 జనవరి 21న మరణించారు. అంతకుముందు కొన్ని రోజుల నుంచి హాస్పిటల్ లోనే చికిత్స పొందుతున్నారు. ఆ సమయంలో అల్లరి నరేష్ సీమ టపాకాయ్ సినిమా షూటింగ్ లో ఉన్నారు. సినిమా క్లైమాక్స్ షూట్ చేస్తున్నారు. ఆ రోజు వదిలితే మిగిలిన స్టార్ కమెడియన్స్ డేట్స్ దగ్గర్లో ఖాళీ లేవు. అందుకే ఆ రోజు ఎలాగైనా షూటింగ్ చేయాల్సి వచ్చింది. అల్లరి నరేష్ కి షూటింగ్ చేయడం ఇష్టం లేదు. కానీ నిర్మాతల డబ్బు, ఆర్టిస్టుల డేట్స్ దృష్టిలో పెట్టుకొని ఆ రోజు షూటింగ్ చేసారు. అది కూడా కామెడీ సీన్స్. అప్పటికే వైద్యులు వాళ్ళ నాన్నకు చాలా సీరియస్ గా ఉందని చెప్పారు. ఓ పక్క ఏడుపు వస్తున్నా ఆ కామెడీ సీన్స్ షూట్ చేసారు. సాయంత్రానికి సినిమా షూట్ అయిపోయింది. అదే సాయంత్రం EVV సత్యనారాయణ చనిపోయారు.
Also Read : Jani Master : న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది.. జానీ మాస్టర్ ట్వీట్.. ఆమెకు కౌంటర్ ఇచ్చాడా?
గతంలో ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ ఈ సంగతి తెలిపారు. అలాగే ఆ సినిమా షూటింగ్ సమయంలో నాన్న చనిపోవడంతో ఇప్పటివరకు కూడా అల్లరి నరేష్ సీమ టపాకాయ్ సినిమా చూడలేదు అంట, ఇకపై కూడా చూడడు అంట. ఆ సినిమాని తలుచుకుంటే వాళ్ళ నాన్న మరణమే గుర్తొస్తుంది అని చెప్పాడు నరేష్. అల్లరి నరేష్ – పూర్ణ కాంబోలో తెరకెక్కిన సీమ టపాకాయ్ సినిమా 2011 మేలో రిలీజయి భారీ హిట్ కొట్టింది. ప్రస్తుతం అల్లరి నరేష్ తన కామెడీ పంథాని పక్కన పెట్టి యాక్షన్, థ్రిల్లర్స్ అంటూ కొత్త జానర్స్ ట్రై చేస్తున్నాడు. కొని రోజుల క్రితం బచ్చల మల్లి అనే సినిమాతో రాగా ఆ సినిమా పరాజయం పాలైంది.