Vasanthi Krishnan: బిగ్‌బాస్‌6 కంటెస్టెంట్ వాసంతీ కృష్ణన్‌ గురించి మీకు తెలుసా..

బిగ్‌బాస్‌ సీజన్‌ 6 13వ కంటెస్టెంట్‌గా వాసంతీ కృష్ణన్‌ ఎంట్రీ ఇచ్చింది. తిరుపతి అమ్మాయ్ అయిన వాసంతీ బెంగళూరులో ఏవియేషన్ కోర్స్ లో పట్టా పొందింది. మోడలింగ్ మీద ఉన్న ఆసక్తితో...

Vasanthi Krishnan: బిగ్‌బాస్‌6 కంటెస్టెంట్ వాసంతీ కృష్ణన్‌ గురించి మీకు తెలుసా..

Do You Know About BiggBoss Contestant Vasanthi Krishnan

Updated On : September 5, 2022 / 5:02 PM IST

Vasanthi Krishnan: బిగ్‌బాస్‌ సీజన్‌ 6 ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా మొదలయింది. “ఈ ఫీల్డ్ లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే అది నా తరవాతే” అంటూ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున. ఆ తర్వాత బంగార్రాజు టైటిల్‌ సాంగ్‌కి మోడల్స్‌తో కలిసి స్టెప్పులేశారు. మనకి రుచులు ఆరు, రుతువులు ఆరు, ఇప్పుడు బిగ్‌బాస్‌ సీజన్‌ కూడా ఆరు అందుకే ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్‌ బిగ్‌బాస్‌ 6 అని షో గురించి చెప్పుకొచ్చాడు నాగార్జున. ఆ తర్వాత తనే హౌస్‌లోకి వెళ్లి హౌస్ మొత్తాన్ని చూపించారు. ఈసారి బిగ్ బాస్ ఇల్లు గత సీజన్లలో కంటే కూడా మరింత రిచ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్స్ ని స్టేజి మీదకి పిలిచాడు.

BiggBoss 6 Marina And Rohit: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్ మెరీనా-రోహిత్‌ జోడీ గురించి మీకు తెలుసా..

ఈ సీజన్‌లో 13వ కంటెస్టెంట్‌గా వాసంతీ కృష్ణన్‌ ఎంట్రీ ఇచ్చింది. తిరుపతి అమ్మాయ్ అయిన వాసంతీ బెంగళూరులో ఏవియేషన్ కోర్స్ లో పట్టా పొందింది. మోడలింగ్ మీద ఉన్న ఆసక్తితో చదువు తరువాత కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తరువాత “సిరిసిరి మువ్వలు” సీరియల్‌తో తెలుగు బుల్లితెరకు పరిచయమై గోరింటాకు, గుప్పెడంత మనసు వంటి పలు సీరియల్స్ లలో కూడా నటించింది.

అలానే సంపూర్ణేష్ బాబుతో కలిసి క్యాలీఫ్లవర్ సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఇటీవలె దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘వాంటెడ్ పండుగాడు’ చిత్రంలో కూడా నటించింది. కాగా ఇప్పుడు బిగ్‌బాస్‌ లోకి అడుగుపెట్టిన వాసంతీని నాగార్జున “నీకు పెళ్లయిందా?” అని అడిగిన ప్రశ్నకు..”నా పేరు పక్కన కృష్ణన్‌ ఉండేసరికి నాకు పెళ్లయిందని అనుకుంటున్నారు అందరూ, కానీ నేను ఇంకా సింగిల్‌” అంటూ తన డ్రీమ్‌బాయ్‌ క్వాలిటీస్ గురించి చెప్పుకొచ్చింది. ఇక చూడాలి హౌస్ లో ఈ బ్యూటీ ఎవరితో మింగిల్ అవుతుందో.