Chiranjeevi Kota Srinivasa Rao
Chiranjeevi – Kota Srinivasa Rao : విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు నేడు తెల్లవారు జామున మరణించారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో కోట శ్రీనివాసరావు కి సంబంధించిన ఆసక్తికర విషయాలు వైరల్ గా మారాయి.
కోట శ్రీనివాసరావు – మెగాస్టార్ చిరంజీవి ఇద్దరూ ఒకే సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. చిరంజీవి సినిమాల్లోకి వద్దామని చెన్నై వచ్చి యాక్టింగ్ కోర్స్ నేర్చుకొని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చిరంజీవి 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయారు.
కోట శ్రీనివాసరావు కూడా ప్రాణం ఖరీదు సినిమాతోనే 1978లో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే అప్పటికే ఆయన బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నారు. ఆ సినిమాలో చిన్న పాత్ర చేసారు. కానీ తర్వాత కంటిన్యూ చేయకుండా తన జాబ్ చేసుకున్నారు. ఏకంగా 5 ఏళ్ళ తర్వాత 1983లో ఒక సినిమా చేసారు.
అనంతరం 1985 నుంచి ఆయన వరుస సినిమాలు చేయడం మొదలుపెట్టారు. 1987లో కోట శ్రీనివాసరావు చేసిన అహ నా పెళ్ళంట సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఆ సినిమాలో బ్రహ్మానందంతో కలిసి పిసినారి వ్యక్తిగా తన అద్భుతమైన నటనతో అందర్నీ మెప్పించాడు. ఆ సినిమా కోట శ్రీనివాసరావు సినీ కెరీర్ ని మలుపు తిప్పింది. ఆ తర్వాత కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు.
Also Read : Kota Srinivasa Rao: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత