Kota Srinivasa Rao : కోట శ్రీనివాసరావు ఏం ఏం అవార్డులు గెలుచుకున్నారో తెలుసా.. నంది అవార్డుల్లో సరికొత్త రికార్డ్..
నటుడు కోట శ్రీనివాసరావు నేడు తెల్లవారుజామున మరణించిన సంగతి తెలిసిందే.

Kota Srinivasa Rao
Kota Srinivasa Rao : ఎన్నో సినిమాలతో విలన్ గా, కమెడియన్ గా మెప్పించిన నటుడు కోట శ్రీనివాసరావు నేడు తెల్లవారుజామున మరణించిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా అనారోగ్యం, వయోభారం సమస్యలతో బాధపడుతున్న ఆయన 83 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. సినీ పరిశ్రమ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు.
కోట శ్రీనివాసరావు నటుడిగా ప్రేక్షకులను మెప్పించడమే కాక ఎన్నో అవార్డులను, రివార్డులను గెలుచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులు అయితే ఏకంగా 9 అవార్డులు గెలుచుకొని అందరికంటే ఎక్కువ అవార్డులు గెలుచుకున్న నటుడిగా నిలిచారు.
Also Read : Kota Srinivasa Rao: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత
కోట శ్రీనివాసరావు ప్రతిఘటన(1985) సినిమాకు స్పెషల్ జ్యురి అవార్డు, గాయం (1993), తీర్పు (1994), గణేష్ (1998), చిన్న (2000) సినిమాలకు బెస్ట్ విలన్ గా, లిటిల్ సోల్జర్స్(1996), పెళ్లైన కొత్తలో (2006), ఆ నలుగురు (2004) సినిమాలకు బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, పృథ్వీ నారాయణ(2002) సినిమాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా.. మొత్తం 9 నంది అవార్డులు గెలిచి సరికొత్త రికార్డ్ సృష్టించారు.
కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా సైమా అవార్డు గెలుచుకున్నారు. 2015లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అలాగే అల్లు రామలింగయ్య పురస్కారంతో పాటు మరి కొన్ని ప్రైవేట్ సంస్థల అవార్డులు, రివార్డులు అందుకున్నారు.
Also Read : Anasuya : మోసపోయిన అనసూయ.. నెల రోజులు అయినా కూడా..