Anasuya : మోసపోయిన అనసూయ.. నెల రోజులు అయినా కూడా..
తాజాగా అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

Anasuya
Anasuya : యాంకర్ అనసూయ ప్రస్తుతం నటిగా సినిమాలు చేస్తూ, పలు టీవీ షోలలో జడ్జిగా ఉంటూ బిజీగానే ఉంది. రంగస్థలం, పుష్ప సినిమాలతో అనసూయ రేంజ్ మారిపోయింది. టాలీవుడ్ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో అనసూయ ఒకరిగా మారింది. ఇటీవలే కొత్త ఇల్లు కట్టుకొని అందులోకి గృహప్రవేశం కూడా చేసింది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన ఫొటోలు షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుందని తెలిసిందే.
తాజాగా అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
Also Read : Singer Mangli : ఫ్యామిలీతో కలిసి శ్రీశైలంలో సింగర్ మంగ్లీ.. ఫొటోలు..
అనసూయ తన పోస్ట్ లో.. ట్రఫుల్ ఇండియా అనే కంపెనీ నుంచి ఆన్లైన్ లో నేను బట్టలు ఆర్డర్ చేశాను, డబ్బులు కూడా చెల్లించాను. నెల రోజులు అయినా ఇంకా డెలివరీ చేయలేదు. డబ్బులు కూడా రీఫండ్ చేయలేదు. మీరు నా డబ్బుని దొంగలించారు డెలివరీ చేయకుండా. ఇలాంటి బాధ్యత లేని వ్యక్తుల నుంచి కొని మోసపోవద్దు. వీళ్ళు ఇలా బిజినెస్ పేరుతో మీ డబ్బులు దొంగిలించడానికి అవకాశం కోసం చూస్తూ ఉంటారు అని పోస్ట్ చేసింది. అయితే అనసూయ పోస్ట్ కి ఆ కంపెనీ ఇంకా సమాధానం చెప్పలేదు.
దీంతో అనసూయ ఆన్లైన్ లో ఆ కంపెనీ నుంచి బట్టలు ఆర్డర్ చేయగా నెల రోజులు అయినా అవి డెలివరీ అవ్వకపోగా, వాళ్ళు స్పందించలేదని, డబ్బులు కూడా రీఫండ్ చేయలేదని తెలుస్తుంది. అందుకే అనసూయ ఈ పోస్ట్ పెట్టి వేరే వాళ్ళను కూడా అలాంటి కంపెనీల నుంచి కొనొద్దు అని జాగ్రత్తలు చెప్తుంది.
Also Read : Producer Raja : సినిమా రివ్యూ నెగిటివ్ గా ఇచ్చాడని.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్మాత..