Naga Chaitanya : నాగచైతన్య రిటైర్మెంట్ ప్లాన్ ఏంటో తెలుసా? ఆ సినిమాలో చూపించినట్టు..

నాగచైతన్య తాజాగా తన రిటైర్మెంట్ ప్లాన్ గురించి చెప్పాడు.

Do You Know Hero Akkineni Naga Chaitanya Retirement Plan Here Details

Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య మంచి హిట్ కోసం చూస్తున్నాడు. అప్పుడెప్పుడో 2022లో బంగార్రాజు సినిమాతో హిట్ కొట్టిన చైతు ఆ తర్వాత చేసిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు చైతు తండేల్ తో రాబోతున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా తెరకెక్కిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.

మూవీ యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో నిన్న ట్విట్టర్లో చైతన్య, సాయి పల్లవి మమ్మల్ని ఏవైనా ప్రశ్నలు అడగాలంటే అడగండి మేము ఒకరినొకరం అడుగుతాం అని పోస్ట్ చేసారు. దీంతో వాళ్లకు వచ్చిన ప్రశ్నలు ఒకర్ని ఒకరు అడిగి వాటికి సమాధానాలు చెప్పిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు సాయి పల్లవి, నాగ చైతన్య.

Also Read : Nagababu : నాగబాబు ఎమోషనల్ పోస్ట్.. 14 ఏళ్ళ జర్నీ ముగిసింది అంటూ.. బాధలో నిహారిక..

చైతన్య సినిమాల్లో ఏ క్యారెక్టర్ తో నీ లైఫ్ ని సెట్ చేయాలనుకుంటున్నావు అని అడిగితే నాగ చైతన్య సమాధానమిస్తూ.. నేను గతంలో కూడా ఓ సారి చెప్పాను. నా రిటైర్మెంట్ ప్లాన్ కి దగ్గరగా ఉండేది ప్రేమమ్ సినిమా క్యారెక్టర్. ప్రేమమ్ సినిమా చివర్లో ఓ రెస్టారెంట్ పెట్టుకొని సెటిల్ అవుతాడు. అలాగే నా రిటైర్మెంట్ లో కూడా ఓ సొంత రెస్టారెంట్ పెట్టుకొని చెఫ్ గా మారి సెటిల్ అవ్వాలి అని తెలిపాడు.

దీంతో చైతు అప్పుడే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకొని దానికి కావాల్సింది కూడా రెడీ చేసుకుంటున్నాడని తెలుస్తుంది. నాగ చైతన్య వంటలు బాగా వండుతాడు. ఆల్రెడీ తనకు ‘షోయు’ అనే ఓ ఫుడ్ క్లౌడ్ కిచెన్ బిజినెస్ ఉంది. అందులో అప్పుడప్పుడు సరదాగా చైతు కూడా వంట చేస్తాడు. చైతు భవిష్యత్తులో ఆ క్లౌడ్ కిచెన్ కాస్తా రెస్టారెంట్ గా మారుస్తాడని తెలుస్తుంది.

Also Read : Telugu Film Day : ‘తెలుగు సినిమా దినోత్సవం’ ఎప్పుడో తెలుసా? టాలీవుడ్ కీలక ప్రకటన.. అవార్డులు కూడా..

అలాగే ఇదే ఇంటర్వ్యూలో.. నాకు హిట్ అవసరం, హిట్ కొట్టి చాలా కాలం అయింది అని తెలిపాడు చైతూ. అలాగే అబ్బాయిలకు స్కిన్ బాగుండాలి అంటే ఏం చేయాలి అని అడగ్గా.. హ్యాపీగా ఉంటే చాలు, అమ్మాయిలను ఏడిపించకూడదు అని అన్నారు. తండేల్ సినిమా గురించి పలు విషయాలు చెప్పారు.