Nagababu : నాగబాబు ఎమోషనల్ పోస్ట్.. 14 ఏళ్ళ జర్నీ ముగిసింది అంటూ.. బాధలో నిహారిక..
రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మెగా బ్రదర్ నాగబాబు ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసారు.

Mega Brother Nagababu Shares an Emotional Post in Social Media
Nagababu : మెగా బ్రదర్ నాగబాబు ఒకప్పుడు సినిమాలు, జబర్దస్త్ తో బిజీగా ఉన్నా గత ఎన్నికల ముందు నుంచి మాత్రం పూర్తిగా జనసేన బాధ్యతలతోనే బిజీ అయ్యారు. తమ్ముడికి అండగా నిల్చొని క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని నడిపిస్తున్నారు. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాగబాబు ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసారు.
తాజాగా నాగబాబు ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కపిల్ల ఫ్లాష్ చనిపోయింది. దీంతో అది చిన్నగా ఉన్నప్పుడు నిహారిక పట్టుకొని దిగిన ఫోటోని, ఆ తర్వాత తనతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేసారు నాగబాబు.
Also Read : Telugu Film Day : ‘తెలుగు సినిమా దినోత్సవం’ ఎప్పుడో తెలుసా? టాలీవుడ్ కీలక ప్రకటన.. అవార్డులు కూడా..
నాగబాబు తమ పెంపుడు కుక్కపిల్లతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసి.. డియర్ ఫ్లాష్.. మాతో నీ 14 ఏళ్ళ జర్నీ ముగిసింది. నువ్వు మా పెట్ కంటే కూడా ఎక్కువ, ఒక ఫ్యామిలీ మెంబెర్ వి. నీ ప్రేమ, నిజాయితీ, నీ అల్లరి మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. నువ్వు నా కూతురి ఫ్రెండ్ వి, ధైర్యానివి, ఆమె అడ్వెంచర్స్ లో పార్ట్నర్ వి. నీతో బంధం విడదీయలేనిది. నీ జ్ఞాపకాలు ఎల్లప్పుడూ గుర్తుంటాయి. చివరి వీడ్కోలు చెప్తున్నప్పుడు నువ్వు ఎల్లప్పుడూ మా గుండెల్లో, జ్ఞాపకాల్లో, కథల్లో ఉంటావు. నీ పాద ముద్రలు మా జీవితంలో ఎప్పటికి ఉంటాయి. డియర్ ఫ్లాష్ నువ్వు ఫ్రీగా స్వర్గంలో పరిగెత్తు, ఆడుకో. మేము నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాము. మేము నిన్ను ఎంత మిస్ అవుతున్నామో మాటల్లో చెప్పలేము అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసారు.
ఈ పోస్ట్ తో ఆ కుక్కపిల్ల నాగబాబు ఇంట్లో 14 ఏళ్లుగా ఉందని, అది వాళ్లకు బాగా క్లోజ్ అయిందని, నిహారికకు కూడా ఆ కుక్కపిల్ల బాగా క్లోజ్ అని, ఇప్పుడు అది చనిపోవడంతో నిహారిక ఎంతో బాధపడుతుంది తెలుస్తుంది.