Anasuya – Kota Srinivasa Rao : 2021లో కోట శ్రీనివాసరావు – అనసూయ వివాదం తెలుసా? కోట అలా అనడంతో ఫైర్ అయిన అనసూయ..
కోట శ్రీనివాసరావు వ్యాఖ్యలపై అనసూయ ఆ సమయంలో సోషల్ మీడియాలో స్పందిస్తూ..

Anasuya - Kota Srinivasa Rao
Anasuya – Kota Srinivasa Rao : నటుడు కోట శ్రీనివాసరావు నేడు ఉదయం మరణించారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన గురించి పలు విషయాలు వైరల్ గా మారాయి. గతంలో కోట శ్రీనివాసరావు – అనసూయ వివాదం వైరల్ అయిన సంగతి తెలిసిందే.
కోట శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో అనసూయ గురించి మాట్లాడుతూ.. అనసూయ మంచి నటి, అందంగా ఉంటుంది. బాగా యాంకరింగ్ చేస్తుంది కానీ తన వస్త్రధారణ నాకు నచ్చదు అని అన్నారు. దీంతో ఈ విషయంపై అనసూయ అప్పట్లో ఫైర్ అయింది.
Also Read : Pawan Kalyan : నా మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’లో ఆయన.. కోట శ్రీనివాసరావు మృతిపై పవన్ కళ్యాణ్..
కోట శ్రీనివాసరావు వ్యాఖ్యలపై అనసూయ ఆ సమయంలో సోషల్ మీడియాలో స్పందిస్తూ.. నా వస్త్రధారణ గురించి ఓ సీనియర్ నటుడు చేసిన కామెంట్లని ఇప్పుడే చూశాను. అపార అనుభవం ఉన్న సీనియర్ నటుడు అలా మాట్లాడం బాధగా అనిపిస్తుంది. దుస్తులు ధరించే తీరు వారి వ్యక్తిగతం. ఒక్కోసారి వృత్తిపరంగా రకరకాల బట్టలు వేసుకోవల్సి వస్తుంది. మీడియా ఇలాంటివి చూపిస్తుంది కానీ ఆ సీనియర్ నటుడు రోజూ మద్యం సేవిస్తారని, చిరిగిన బట్టలు తొడుక్కుంటారని, ఆన్‌స్ర్కీన్ మహిళల్ని కించపరిచే విధంగా పవర్తిస్తారని చూపించరు. నాలా ఫ్యామిలీ కోసం కష్టపడే వాళ్ళ మీద ఎందుకు కామెంట్స్. మీ ఒపీనియన్‌ని పబ్లిక్‌గా ఎదుటివారు బాధపడుతారు అని కూడా లేకుండా ఎలా చెబుతారు? పక్కవారిపై కామెంట్స్ చేయకుండా మీ పని మీరు చూసుకోండి. వీలైతే మంచిగా ఎవరికైనా స్పూర్తిని ఇచ్చే మాటలు మాట్లాడండి అని పోస్ట్ చేసింది.
2021లో కోట – అనసూయ వివాదం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కోట అన్న పాజిటివ్ మాటల్ని పట్టించుకోకుండా అనసూయ ఒక్క మాటకు ఇలా రియాక్ట్ అయిందంటూ ఆమెని కూడా విమర్శించారు నెటిజన్లు. కొన్ని రోజులు సోషల్ మీడియాలో అనసూయ, కోటకు సపోర్ట్ గా ఈ వివాదం సాగింది.
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 18, 2021
Also Read : Kota Srinivasa Rao : సోషల్ మీడియా వేదికగా కోట శ్రీనివాసరావుకు సినీ ప్రముఖుల నివాళి.. ఎవరెవరు ఏమన్నారు అంటే..