Jaya Prakash Reddy : బాలయ్య ‘సమరసింహారెడ్డి’ సినిమాకు.. విలన్ జయప్రకాశ్ రెడ్డి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఆ తర్వాత రోజుకు ఎంతంటే..
ఇటీవల జయప్రకాశ్ రెడ్డి కూతురు మల్లికా రెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఆయన రెమ్యునరేషన్స్ గురించి మాట్లాడింది.

Do You Know Jaya Prakash Reddy Remuneration for Balakrishna Samarasimha Reddy Movie
Jaya Prakash Reddy : టాలీవుడ్ లో విలన్ గా, కమెడియన్ గా దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు జయప్రకాశ్ రెడ్డి. ఆయన 2020లో కరోనా సమయంలో మరణించారు. అయన కెరీర్లో విలన్ గా స్టార్ డమ్ తెచ్చిన సినిమా సమరసింహా రెడ్డి. ఆ సినిమాలో జయప్రకాశ్ రెడ్డి బాలయ్యకు ధీటుగా కనిపించి తన విలనిజంతో అదరగొట్టారు. ఆ సినిమా తర్వాత జయప్రకాశ్ రెడ్డి కి ఆఫర్స్ కూడా బాగా పెరిగాయి. రెమ్యునరేషన్స్ కూడా పెరిగాయి.
ఇటీవల జయప్రకాశ్ రెడ్డి కూతురు మల్లికా రెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఆయన రెమ్యునరేషన్స్ గురించి మాట్లాడింది.
Also Read : Vishnupriya – Prithvi : పృథ్వీతో రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన విష్ణుప్రియ.. ఒకవేళ అతను చెప్తే..
మల్లికా రెడ్డి మాట్లాడుతూ.. సమరసింహారెడ్డి సినిమాకు నాన్న గారికి సినిమా మొత్తానికి 75,000 రెమ్యునరేషన్ ఇచ్చారు. ఆ సినిమా హిట్ అయినదానికీ, నాన్న పాత్రకు అప్పుడు తక్కువే అది. ఆ సినిమా తర్వాత నాన్న ఒక బొలోరో కార్ కొంటే సినిమా వాళ్ళు గిఫ్ట్ గా ఇచ్చారేమో, ఆ సినిమాకు వచ్చిన డబ్బులతో కొన్నారేమో అని అందరూ అన్నారు. కానీ నాన్న EMI లో ఆ కార్ తీసుకున్నారు.
నాన్న రోజుకు 5000 నుంచి 10,000 రెమ్యునరేషన్స్ తీసుకునే స్థాయి నుంచి రోజుకు లక్ష, రెండు లక్షలు తీసుకునే స్థాయికి ఎదిగారు అని తెలిపింది.