Do You Know Pawan Kalyan Gabbar Singh Villain Abhimanyu Singh Remuneration for That Movie
Abhimanyu Singh : సినిమాల్లో స్టార్ నటీనటులకు రెమ్యునరేషన్స్ బాగానే ఉంటాయని అనుకుంటాం. కానీ గుర్తింపు వచ్చి ఒక హిట్ పడితే కానీ పెద్ద రెమ్యునరేషన్స్ రావు. ఒక పెద్ద హిట్ పడేదాకా లేదా తమ పాత్రకు గుర్తింపు వచ్చేదాకా సినిమాల్లో నటీనటుల రెమ్యునరేషన్స్ చాలా తక్కువే ఉంటాయి. తాజాగా గబ్బర్ సింగ్ విలన్ అభిమన్యు సింగ్ తన రెమ్యునరేషన్స్ గురించి మాట్లాడారు.
బీహార్ కి చెందిన అభిమన్యు సింగ్ అక్స్ సినిమాతో హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆర్జీవీ రక్త చరిత్ర సినిమాలో తన నటనతో అందర్నీ మెప్పించి విలన్ గా స్థిరపడ్డాడు. ఇక గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ కి ఎదురుగా విలన్ పాత్రలో నటించి మెప్పించడంతో అన్ని భాషల్లో విలన్ గా వరుస ఆఫర్స్ వచ్చాయి. అభిమన్యు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో అనేక సినిమాల్లో నటించాడు.
ఇటీవల అభిమన్యు సింగ్ విశ్వక్ సేన్ లైలా సినిమాలో కామెడీ విలన్ గా నటించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అభిమన్యు సింగ్ తన రెమ్యునరేషన్స్ గురించి తెలిపాడు. అభిమన్యు మాట్లాడుతూ.. నా మొదటి సినిమా అక్స్ కు 11 వేలు రెమ్యునరేషన్ ఇచ్చారు. ఆర్జీవీ రక్త చరిత్ర సినిమా మొత్తానికి 40 వేలు రెమ్యునరేషన్ ఇచ్చారు. కానీ ఆ సినిమాలో నా పాత్ర బాగా పాపులర్ అయింది. ఆ పాత్రతోనే నాకు చాలా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమాకు ఒకే సారి జంప్ చేసి 40 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నాను అని తెలిపారు.
అలాగే.. గబ్బర్ సింగ్ షూట్ అప్పుడు పవన్ సర్ బిజీగా ఉండటంతో నాతోనే షూటింగ్ మొదలుపెట్టారు. వారం రోజుల్లో నాకు సంబంధించిన సీన్స్ అన్ని తీసేసారు. ఆ తర్వాత నావి, పవన్ సర్ కాంబో సీన్స్ షూట్ చేసారు అని తెలిపారు. ప్రస్తుతం అభిమన్యు పవన్ OG సినిమాతో పాటు లూసిఫర్ సీక్వెల్ లో నటిస్తున్నారు.