Shah Rukh Khan : 50 లక్షల రింగ్ గిఫ్ట్ గా ఇస్తే వద్దన్న షారుఖ్.. కానీ లగ్జరీ కార్ మాత్రం తీసుకొని.. మూడు నెలలు..
బాలీవుడ్ పాపులర్ ర్యాప్ సింగర్ మికా సింగ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడాడు.

Bollywood Rapper Mika Singh Gifts Costly Diamond Ring to Shah Rukh Khan
Shah Rukh Khan : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ 2023 కంబ్యాక్ ఇచ్చి జవాన్, పఠాన్, డుంకి.. మూడు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు నెక్స్ట్ సినిమా రాలేదు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ రెండు సినిమాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. సాధారణంగానే అభిమానులు తమ ఫేవరేట్ హీరోలకు గిఫ్ట్స్ ఇస్తుంటారు. అలాంటిది ఓ సింగర్ షారుఖ్ ఖాన్ కి ఫేవరేట్ అభిమాని అయితే ఏ రేంజ్ లో గిఫ్ట్ ఇస్తాడు మరి.
బాలీవుడ్ పాపులర్ ర్యాప్ సింగర్ మికా సింగ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడాడు. మికా సింగ్ మాట్లాడుతూ.. నేను షారుఖ్ ఖాన్ కి వీరాభిమాని. మొదటిసారి ఆయనను కలిసినప్పుడు ఏదైనా గొప్ప బహుమతి ఇవ్వాలనుకున్నాను. ఆయన్ని కలిసినప్పుడు 50 లక్షల విలువైన డైమండ్ రింగ్ చేయించి షారుఖ్ ఖాన్ కి బహుమతి ఇచ్చాను. కానీ అది చాలా ఖరీదైనది అని వద్దని నాకు తిరిగి ఇచ్చేసారు షారుఖ్. అయినా నేను పట్టుబట్ట తీసుకోవాల్సిందే అని, అభిమానంతో ఇచ్చాను అని చెప్పి షారుఖ్ ఖాన్ కి ఆ రింగ్ ఇచ్చాను అని తెలిపాడు.
అలాగే.. ఓ సారి షారుఖ్ ఖాన్ నా కార్ లో ప్రయాణించారు. అది కొంచెం లగ్జరీ కార్. ఆ కార్ నచ్చడంతో తన వద్ద ఉంచుకుంటాను అని చెప్పి మూడు నెలలు నా కార్ ని వాడుకున్నాడు. ఆ తర్వాత దాన్ని రిటర్న్ ఇచ్చేసాడు షారుఖ్. నేను, షారుఖ్ ఖాన్, గౌరి ఖాన్ కార్ రైడ్ కి కూడా వెళ్ళాము అని తెలిపాడు మికా సింగ్.