Actress Rohini : కొత్త కారు కొన్న నటి.. తల్లిదండ్రులకు ఆ ఒక్క బహుమతి ఇవ్వాలని..

నటి రోహిణి కొత్త కారు కొన్నారు. దాని ధరెంతో కూడా చెప్పేసారు. ఇక ఒకే కోరిక ఉందని వెల్లడించారు.. అదేంటంటే?

Actress Rohini : కొత్త కారు కొన్న నటి.. తల్లిదండ్రులకు ఆ ఒక్క బహుమతి ఇవ్వాలని..

Actress Rohini

Updated On : January 7, 2024 / 3:38 PM IST

Actress Rohini : బుల్లితెరపై కామెడీ పండించే నటిమణుల పేర్లలో రోహిణీ ఉంటారు. జబర్దస్త్, అదిరింది వంటి షోలలో కడుపుబ్బా నవ్వించిన ఈ నటి అటు సినిమాలు.. ఇటు షోలతో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా ఈ నటి కొత్తకారు కొన్నారు. ముచ్చటగా మూడోసారి కొన్న ఆ కారు .. దాని ధరతో పాటు తల్లితండ్రుల కోసం ఇంకా తానేం చేయాలనుకుంటున్నారో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వివరించారు ఈ నటి.

Karthik Raju : కార్తీక్ రాజు.. మొన్న అధర్వ.. త్వరలో ‘ఐ హేట్ యు’..

రోహిణి చక్కని హాస్యనటిగా పేరు తెచ్చుకున్నారు. కామెడీ షోలతో పాటు బలగం, మత్తువదలరా వంటి సినిమాల్లో కూడా నటించారు. బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ కూడా అయిన రోహిణి రౌడీ రోహిణి అనే పేరుతో సొంత యూ ట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. అందులో తనకు సంబంధించిన అనేక విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా తాను కొన్న కొత్తకారుని చూపించడంతో పాటు పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

Swapna Chowdary : బిగ్ బాస్ షో పేరుతో మోసపోయిన నటి.. లక్షల్లో డబ్బులు వసూలు చేసిన కేటుగాడు

రోహిణి మొదటగా రూ.9 లక్షలు పెట్టి కొన్న కారు యాక్సిడెంట్‌లో దెబ్బతిందట. రెండవసారి రూ.14 లక్షలు పెట్టి కొన్న కారును అమ్మేసి రీసెంట్‌గా మూడవ కారును రూ.25 లక్షలు పెట్టి కొన్నారు. అది కియా సెల్టోస్ జీటీఎక్స్ ప్లస్ బ్రాండ్ కారు. ఆడి కారు కొందామని ప్లాన్ ఉన్నా దాని ఖరీదు రూ.57 లక్షలు కావడంతో మరీ అంత ధర పెట్టి లోన్‌కి వెళ్లడమెందుకని వెనకడుగువేసారట. ఇప్పటికే ఇల్లు, కారు కొన్న రోహిణికి ఒకే ఒక కోరిక మిగిలిందట. తన తల్లితండ్రులకు ఒక ఇల్లు కొనివ్వాలని రోహిణి అనుకుంటున్నారట. రోహిణి కోరిక నెరవేరాలని కోరుకుందాం.