Find The Actress : ఈ ఫొటోలో పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు స్టార్ యాంకర్.. నటి కూడా..
ఇంతకీ ఈ ఫొటోలో ఉన్న చిన్నపాప ఎవరా అనుకుంటున్నారా?

Do You Know This Baby Child in Photo Find The Anchor
Find The Actress : అప్పుడప్పుడు మన సెలబ్రిటీల చిన్నప్పటి ఫొటోలు వైరల్ అవుతాయని తెలిసిందే. ఇటీవల ఓ టాలీవుడ్ స్టార్ యాంకర్ తను చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసింది. దీంతో ఆ యాంకర్ చిన్నప్పటి ఫోటో వైరల్ గా మారింది. ఇంతకీ ఈ ఫొటోలో ఉన్న చిన్నపాప ఎవరా అనుకుంటున్నారా?
Also See : Trisha Birthday Celebrations : ‘త్రిష’ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు చూసారా?
ఈ ఫొటోలో ఉన్న చిన్న పాప ఇప్పుడు యాంకర్ శ్రీముఖి. శ్రీముఖి వాళ్ళ నాన్న తనని చిన్నప్పుడు ఎత్తుకున్న ఫోటోని షేర్ చేసింది. నటిగా శ్రీముఖి జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అదుర్స్ షోతో యాంకర్ గా మారి పలు ఛానల్స్ లో అనేక టీవీ షోలకు యాంకరింగ్ చేస్తూ వచ్చింది. పటాస్ షోతో స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి.
మధ్యమధ్యలో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అనేక సినిమాలు చేసింది. ప్రస్తుతం శ్రీముఖి ఆదివారం విత్ స్టార్ మా పరివారం, కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలు చేస్తూ అలరిస్తుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన ఫోటోషూట్స్ పోస్ట్ చేసి ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది.
View this post on Instagram
Also Read : Chiranjeevi : 104 జ్వరంతో కూడా ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ వేసిన మెగాస్టార్.. సినిమా కోసం చిరు డెడికేషన్..