Do You Know Triptii Dimri Charcater in Prabhas Spirit Movie and Her Remuneration
Triptii Dimri : సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ పోలీసాఫీసర్ అని కూడా సందీప్ చెప్పేసాడు. ఈ డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలవ్వనుంది అని సమాచారం. మొదటి షెడ్యూల్ మెక్సికోలో జరగనుంది. అయితే ఇటీవల స్పిరిట్ హీరోయిన్ విషయం బాగా ట్రెండ్ అయి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
స్పిరిట్ సినిమాలో మొదట దీపికా పదుకోన్ ని హీరోయిన్ అనుకున్నా ఆమె బోలెడు కండిషన్స్ పెట్టడంతో వద్దనుకుని యానిమల్ ఫేమ్ త్రిప్తి దిమ్రిని హీరోయిన్ గా ప్రకటించారు. యానిమల్ సమయంలో ఏ రేంజ్ లో ఫేమ్ తెచ్చుకుందో త్రిప్తి దిమ్రి మరోసారి స్పిరిట్ సినిమాలో హీరోయిన్ అనౌన్స్మెంట్ తోనే మరింత పాపులర్ అయింది.
Also Read : Akhil Akkineni : అఖిల్ పెళ్లి త్వరలోనే..? ఆ డేట్ లోనే అంటూ రూమర్స్..
స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్ర అయితే త్రిప్తి దిమ్రి డాక్టర్ పాత్రలో కనిపించనుందని సమాచారం. డాక్టర్ – పోలీస్ మధ్య రొమాన్స్ సీన్స్ కూడా బానే ఉన్నాయట. అలాగే ఈ సినిమాకు త్రిప్తి దిమ్రి 4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం. దీపికా పదుకోన్ ఈ సినిమాకు 20 కోట్ల రెమ్యునరేషన్ అడగడమే కాకుండా ప్రాఫిట్స్ లో కూడా షేర్ అడిగి పలు కండిషన్స్ పెట్టింది.
ఇప్పుడు త్రిప్తి దిమ్రి కేవలం 4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోవడంతో మూవీ యూనిట్ కి భారీగా డబ్బులు సేవ్ అయ్యాయని అంటున్నారు. మరి ప్రభాస్ – త్రిప్తి దిమ్రి రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
Also Read : Seetha Payanam : యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు హీరోయిన్ గా.. ‘సీతా పయనం’ టీజర్ రిలీజ్..