12th Fail : కష్టాలను ఎదిరించి.. ప్రేమను గెలిపించుకున్న ఐపీఎస్ ఆఫీసర్.. 12th ఫెయిల్ సినిమా ఎవరి లైఫ్ స్టోరీనో తెలుసా?

కష్టాలను ఎదిరించి .. ప్రేమను గెలిపించుకున్న ఓ ఐపీఎస్ ఆఫీసర్ కధ '12th ఫెయిల్' సినిమా. అయితే ఈ స్టోరీ ఎవరి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారో తెలుసా?

12th Fail

12th Fail : లేటెస్ట్ బాలీవుడ్ మూవీ ’12th ఫెయిల్’ సూపర్ హిట్ అయ్యింది. విధు వినోద్ చోప్రా డైరెక్ట్ చేసిన ఈ సినిమా అనురాగ్ పాఠక్ రాసిన కథ ఆధారంగా తెరకెక్కించారు. టైటిల్ రోల్‌లో విక్రాంత్ మాస్సే అద్భుతంగా  నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అసలు ఈ సినిమా రియల్ స్టోరీ ఎవరిదో మీకు తెలుసా?

’12th ఫెయిల్’ 27 అక్టోబర్ 2023 న థియేటర్లలో విడుదలైంది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.60 కోట్లకు పైగా వసూలు చేసింది. 2019 లో అనురాగ్ పాఠక్ రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అసలు ఆ పుస్తకంలోని కథలో రియల్ హీరో ఎవరో తెలుసా?  ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ. ఆయన జీవిత కథనే 12th ఫెయిల్ సినిమాగా తెరకెక్కించారు. మనోజ్ కుమార్ శర్మ ఐపీఎస్ ఆఫీసర్ కావడానికి ఎలాంటి కష్టాలు పడ్డారు అన్నది ఈ సినిమా అసలు కథ.

12th Fail : 12th ఫెయిల్ సినిమాపై IAS ఆఫీసర్ ట్వీట్.. ఇది మీ సక్సెస్ కాదు..

మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లా నివాసి అయిన మనోజ్ కుమార్ శర్మ 1977 లో బిల్‌గావ్ అనే గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి వ్యవసాయ శాఖలో ఉద్యోగం చేసేవారు. అయితే శర్మ కుటుంబం చాలా ఆర్ధిక సమస్యలు ఎదుర్కుందట. చిన్న వయసులో శర్మ చదువుపట్ల ఆసక్తి చూపేవారు కాదట. IX, X తరగతులకు వచ్చేసరికి థర్డ్ క్లాస్ మార్కులు వచ్చాయట. XII తరగతిలో హిందీ తప్ప అన్ని సబ్జెక్ట్స్‌లో ఫెయిల్ అయ్యారట. ఆ సమయంలోనే ప్రేమలో పడ్డ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఒక్కసారిగా మారిపోయిందట.

శర్మ శ్రద్ధా జోషితో ప్రేమలో పడ్డా తాను XII ఫెయిల్ కావడంతో ఆమెకు ప్రపోజ్ చేయలేకపోయారట. చివరికి ప్రపోజ్ చేస్తే అనూహ్యంగా ఆమె అంగీకరించారట. ప్రపోజ్ చేస్తున్నప్పుడు ‘నువ్వు నా ప్రేమను అంగీకరిస్తే.. నేను ఈ ప్రపంచాన్ని గెలుస్తాను’ అని చెప్పారట శర్మ. తన ప్రేమ గెలవాలని అప్పటి నుండి కష్టపడటం మొదలుపెట్టిన శర్మ UPSC పరీక్షలకు రెడీ అయ్యారట. పరీక్షల ప్రిపరేషన్ కోసం.. తన ఫీజుల కోసం ఆయన చేయని ఉద్యోగాలు లేవట. ఢిల్లీలో సంపన్నుల టెంపో నడపడం దగ్గర్నుండి.. వాకింగ్ డాగ్స్ వరకు అన్ని పనులు చేసారట. ఒక్కోసారి ఢిల్లీ వీధుల్లో పడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయట. ఢిల్లీలో ఒక లైబ్రరీలో ప్యూన్‌గా కూడా చేసారట శర్మ. UPSC CSE పరీక్షలో మూడుసార్లు ఫెయిల్ అయినా నాల్గవ ప్రయత్నంలో 121వ ర్యాంకుతో విజయం సాధించారు. IPS ఆఫీసర్ అయ్యారు మనోజ్ కుమార్ శర్మ.

Jr NTR : దేవర గ్లింప్స్‌లో ఇది గమనించారా? NTR ట్యాగ్ అఫీషియల్ గా మారింది.. ఇకపై యంగ్ టైగర్ కాదు..

ఒక రకంగా చెప్పాలంటే జోషితో ప్రేమలో పడటం కూడా శర్మకి కలిసి వచ్చిందని చెప్పాలి. కుటుంబాన్ని ఆర్ధిక కష్టాల నుండి బయటపడేయాలన్న పట్టుదలతో పాటు జోషిపై శర్మకున్న ప్రేమ శర్మను గెలిపించిందని చెప్పాలి. ఇక ఆయన భార్య జోషి  IRS అధికారిణి. ప్రస్తుతం మహారాష్ట్ర టూరిస్ట్ డిపార్ట్ మెంట్‌లో పని చేస్తున్నారు. శర్మ జీవిత కథ సినిమా కథకు సరిపోతుంది.  అందుకే ఆయన జీవిత కథ తెరపై ’12th ఫెయిల్’ సినిమాగా స్ధానం సంపాదించుకుంది. విమర్శకుల ప్రశంసలు పొందింది. మనోజ్ కుమార్ శర్మ పాత్రలో విక్రాంత్ మాస్సే సరిగ్గా సరిపోయారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు