Find The Persons : వీళ్ళు ఎవరో తెలుసా? టాలీవుడ్ గర్వించదగ్గ స్టార్ కమెడియన్ తల్లితండ్రులు.. వీళ్ళ గురించి ఎంత గొప్పగా చెప్పారో..

వీళ్ళు ఎవరి తల్లితండ్రులో తెలుసా?

Find The Persons : వీళ్ళు ఎవరో తెలుసా? టాలీవుడ్ గర్వించదగ్గ స్టార్ కమెడియన్ తల్లితండ్రులు.. వీళ్ళ గురించి ఎంత గొప్పగా చెప్పారో..

Do You Know Who is this Tollywood Star Comedian Parents photo goes Viral

Updated On : February 12, 2025 / 7:38 AM IST

Find The Persons : ప్రస్తుతం ఈ పెద్దవాళ్ళ ఫోటో వైరల్ గా మారింది. ఇంతకీ ఈ పెద్ద జంట ఎవరో తెలుసా? వీళ్ళు ఎవరి తల్లితండ్రులో తెలుసా? టాలీవుడ్ గర్వించదగ్గ కమెడియన్, పద్మశ్రీ, గిన్నిస్ బుక్ అవార్డులు సాధించి దాదాపు వెయ్యికి పైగా సినిమాలతో మనల్ని నవ్వించిన లెజెండరీ నటుడు బ్రహ్మానందం తల్లితండ్రులు. బ్రహ్మానందం, ఆయన కొడుకు రాజా గౌతమ్ కలిసి చేస్తున్న బ్రహ్మ ఆనందం సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

ఈ సినిమా తాత – మనవడు కథ కావడంతో ఈవెంట్లో బ్రహ్మానందం పేరెంట్స్ ఫోటోని చూపించారు. ఈ ఫోటో చూపించి తాతయ్యతో మీకు ఎలా అనుబంధం ఉండేది అని బ్రహ్మానందం తనయుడు, హీరో రాజా గౌతమ్ ని అడిగారు. దీనికి రాజా గౌతమ్ సమాధానమిస్తూ.. నేను పుట్టేసరికి ఆయన లేరు. ఆయన గురించి నాకు అంతగా తెలీదు. కానీ నాన్న గారు మాత్రం అప్పుడప్పుడు బాగా చెప్పేవాళ్ళు తాతయ్య గురించి అని అన్నారు.

Also Read : Chiranjeevi : మా తాత మంచి రసికుడు.. తన తాతయ్య గురించి చిరంజీవి ఆసక్తికర కామెంట్స్..

దీంతో బ్రహ్మానందంను ఆయన తల్లితండ్రుల గురించి మాట్లాడమనగా.. అమ్మానాన్నల గురించి చెప్పడం అంటే దేవుడి గురించి చెప్పడమే. మా అమ్మానాన్నలు మామూలు అమ్మానాన్నలు కాదు ఓ వైపు పేదరికం, ఓ వైపు పెద్దరికం పంచుకున్న వాళ్ళు. వాళ్ళు నా తల్లితండ్రులు అని చెప్పుకోడానికి, నా జీవితాన్ని ఈ మార్గంలో పెట్టడానికి మా నాన్న చెప్పిన ఒకే ఒక్క మాట ఇప్పటికి చెప్పాలనిపిస్తుంది. నాన్న.. నీ కంటే నేను ఎక్కువ చదువుకోలేదు, కానీ నాకు తెలిసిన విషయం ఒకటి చెపుతాను. ఒక మనిషి 18 రోజులు ఆహరం లేకపోతే చనిపోతాడు. కానీ 17 రోజుల వరకు ఎవర్ని అడుక్కోకు. 18వ రోజు మాత్రం ఎవర్నైనా అడిగి తెచ్చుకో. ఈ లోపు అడిగితే ఈ 17 రోజులు చనిపోయినట్టే ఉంటుంది అని చెప్పారు. నేను నా జీవితం మొదటి నుంచి లెక్చరర్ నుంచి ఇప్పటిదాకా కూడా నేను ఎవర్ని అప్పు అడగలేదు, ఎవరూ నా అప్పు ఎప్పుడిస్తావు అని అడగడం నాకు తెలీదు. మా అమ్మ నాన్న నాకు నేర్పిన పాఠాల్లో ఇదొకటి అని వాళ్ళ పేరెంట్స్ గురించి గొప్పగా చెప్పారు బ్రహ్మానందం.

Do You Know Who is this Tollywood Star Comedian Parents photo goes Viral

Also Read : Chiranjeevi : మగ పిల్లాడు కావాలి- బ్రహ్మా ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

దీంతో బ్రహ్మానందం పేరెంట్స్ ఫోటోతో పాటు ఆయన చెప్పిన మాటలు కూడా వైరల్ గా మారాయి. రాహుల్ యాదవ్ నక్క నిర్మాణంలో నిఖిల్ దర్శకత్వంలో బ్రహ్మానందం, ఆయన కొడుకు రాజా గౌతమ్ కలిసి చేస్తున్న సినిమా బ్రహ్మ ఆనందం ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. నిజ జీవితంలో తండ్రికొడుకులైన బ్రహ్మానందం రాజా గౌతమ్ ఈ సినిమాలో తాత మనవళ్ళు గా నటిస్తున్నారు.